పాఠశాలలో చదువుతున్నప్పుడు హోం వర్క్ చేయకపోయినా, స్కూల్ రాకపోయినా, మంచి మార్కులు తెచ్చుకోకపోయినా.. గోడ కూర్చీ(Wall Sit) వేయించే ఉంటారు. గోడ కూర్చీ వేస్తే..
అబ్బా సార్ ఏంటి ఇంత టార్చర్ పెడుతున్నాడని అనుకునే ఉంటారు. కాళ్లు లాగేస్తున్నాయి.. చేతులు నొప్పి పెడుతున్నాయని తిట్టుకుని ఉంటారు. కానీ గోడ కుర్చీతో ఎన్నో లాభాలు ఉన్నాయి.
రోజుకు ఐదు నిమిషాలు గోడకుర్చీ(5 Minutes Wall Sit) వేస్తే.. ఆరోగ్య ప్రయోజనాలు. చిన్నప్పుడు పనిష్మెంట్ అయింది.. కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే వ్యాయామం అది.
గోడ కుర్చీ(Wall Sit) వ్యాయామం వేసేందుకు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. వేలకు వేలుగా ఫీజులు కట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. గోడకు ఆనుకుని ఉంటే ఒక కుర్చీ ఎలా ఉంటుందో గుర్తుచేసుకోండి.
గోడకు శరీరాన్ని కుర్చీ పోజులో పెట్టుకోవాలి. కదలకుండా ఉండాలి. ఇది చేసేందుకు గోడకు మీ రెండు పాదాలను సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటారుగా నిలబడాలి.
మోకాలు నుంచి పాదాల వరకూ కాళ్లను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాలి నుంచి పిరుదుల వరకూ శరీర మధ్య భాగం.. భూమికి సమాంతరంగా చేసి శరీర పై భాగాన్ని నిటారుగా చేయాలి.
శరీరం(Body)లోని పైభాగం గోడకు ఉంటుంది. చేతులు బార్లా చాపి.. భూమికి సమాంతరంగా పెడితే.. అవి గోడకు ఆనుకుని ఉంటాయన్నమాట.
మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. కదలకుండా ఐదు నిమిషాలు చేయండి. దీనివల్ల కండరాలు దృఢంగా మారుతాయి. వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. వెన్ను నొప్పి(Back Pain) కూడా తగ్గుతుంది.
గోడ కుర్చీతో క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. బరువు కూడా తగ్గొచ్చు. హృదయ(Heart) సంబంధం వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గోడ కుర్చీతో కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా అవుతాయి.
పొట్ట వద్ద ఉండే కండరాలు.., బలంగా తయారై, పొట్ట కూడా తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు ఉండేవారు.. రెగ్యులర్ గా గోడ కూర్చి వేయాలి. ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు.., ఈ వ్యాయామం(Exercise) చేస్తే.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
0 Comments:
Post a Comment