అక్కడికి వెళ్లినవారు బతికిబట్టకట్టలేదు... మానవ అవశేషాలతో నిర్మితమైన ప్రాంతం అది..
ఈ సువిశాల ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. దూరపు కొండలు నునుపు అన్నట్టు... మనకు తెలియని ప్రపంచం చాలా అందమైనది అని భావిస్తూ ఉంటాం.
కానీ దగ్గరకి వెళ్లి చూసాకే అందులో లోటుపాట్లేమిటో బోధపడతాయి. ఈ క్రమంలో మనం అనేక ప్రాంతాలు చాలా అందమైనవి అని వింటూ ఉంటాం. అలాగే మరికొన్ని ప్రదేశాలు చాలా స్పెషల్ అని అంటుంటారు. కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగాను, మరికొన్ని ప్రదేశాల చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది.
ప్రస్తుతం అలాంటి ఓ భయానక ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రాంతం సగం భూమి సగం మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతూ వుంటారు. అయితే ఈ నిర్మాణం వెనుక భయంకరమైన చరిత్ర కూడా ఉందని చెబుతారు. ఇంతకీ ఆ ప్రదేశం ఏదని అనుకుంటున్నారు కదూ? ఇటలీలోని( Italy ) వెనిస్, లిడో నగరాల మధ్య వున్న నిషేధ ప్రాంతమే 'వెనీషియన్ గల్ఫ్.'( Venetian Gulf ) ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. మరెక్కడికి పోతారంటారా? పైకే మరి. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లి బతికి వచ్చిన మనిషి ఒక్కరు కూడా లేరని చెబుతూ వుంటారు. దీంతో ఆ నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఆ ప్రాంతాన్ని చాలామంది శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు. సుమారు 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్విపం చుట్టూతా ఎత్తైన గోడలు ఉంటాయి. ఈ ద్వీపం ఎందుకు మారిందంటే... ఇటలీలో ప్లేగు మహమ్మారి( Plague ) వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని అప్పటి ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకొని వెళ్లి వదిలేసిందట. ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని భావించిన ప్రభుత్వం అలాంటి దారుణానికి ఒడిగట్టింది. దాంతో ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.. మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా ద్వీపంలోనే వారిని ఖననం చేశారు. అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు.
0 Comments:
Post a Comment