Vastu : బెడ్ రూమ్‌లో మంచం ఏ దిక్కులో ఉంది. కొంపదీసి, కాళ్ళు గానీ పడమర వైపు పెట్టారా?
చక్కని నిద్రకోసం, కడుపు నిండా తిండి కోసమే ఈ పాట్లన్నీను. మనిషి బ్రతకడానికి ఏది చేసినా తిండి, నిద్ర కోసమే. అయితే పూర్తి ఆరోగ్యానికి, కంటి నిండా నిద్రకూ కూడా వాస్తు కావాలంటున్నారు వాస్తు నిపుణులు.
ప్రస్తుతకాలంలో రాత్రి పనులు, ఉదయం, ఉదయం చేయాల్సిన పనులు రాత్రి చేస్తూ సమయాన్ని, రోజులను పాడుచేసుకుంటున్నాం. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో నిద్రించకపోతే నిద్ర కూడా సరిగా పట్టదనే విషయాన్ని గ్రహించి, మార్పులు చేసుకోవాలి.
పక్కా వాస్తు ఉంటేనే ఏదైనా చేయడం ఇప్పటి రోజుల్లో పరిపాటిగా మారింది. సరైన దిశలో లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. వాస్తు ప్రకారం నింద్రించే గదిలో పడకలు ఉండేలా చూసుకోవాలి.
ఉత్తరం వైపున ఈ ఏర్పాటు చేసుకోవాలి. లేదా తూర్పు వైపు కాళ్ళు పెట్టుకుని పడుకునేలా మంచం ఉండాలి. అదే దిశను మార్చేసి పడమర వైపు కాళ్ళు, తూర్పు ముఖంగా తల పెట్ట పడుకుంటే వాస్తు విరుద్దమే కాదు. ప్రతికూల ఫలితాలు అందుకుంటారు.
నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్లు శుభ్రంగా కడిగి, పడుకోవాలి. భోజనానికి ముందు పడుకునే ముందు కాళ్ళు కడుక్కోవాలనేది పూర్వీకుల నుంచి వస్తుంది. వాస్తు ప్రకారం పడకలను మార్చడమే కాదు ఇలాంటి చిన్న చిన్న అలవాట్ల వల్ల కూడా సుఖ నిద్ర మీకు కలుగుతుంది.
ఇది రాంగ్ మాస్టారు. తూర్పు వైపే తల పెట్టి పడుకోవాలి. పడమరవైపు అసలు పెట్టకూడదు.
ReplyDelete