పురాతన భారతీయ నిర్మాణ వ్యవస్థ అయిన వాస్తు శాస్త్రం...
ప్రత్యేక స్థలాల్లో వస్తువులు, నిర్మాణాలను ఉంచడం ద్వారా సానుకూల శక్తి (Positive Energy) వచ్చి.. అది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది అని చెబుతోంది.
ఇందుకోసం కొన్ని నియమాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రంలో సూది, దారం పెట్టడానికి సంబంధించిన కొన్ని సాధారణ మార్గదర్శకాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.
Clean Space : సూదులు, దారాలను శుభ్రమైన, మంచి ప్రదేశంలో ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం చిందరవందరగా ఉన్న ప్రదేశాలు నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటాయి. అలాంటిచోట పెట్టే సూదులు, దారాలూ ప్రమాదకరంగా మారతాయి.
Place them in the East or North : గదికి తూర్పు లేదా ఉత్తర దిశలో సూదులు, దారాలను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ దిశలు సానుకూల శక్తి (Positive Energy) ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటాయి.
Avoid keeping in the South or Southwest : గది.. దక్షిణ లేదా నైరుతి దిశలో సూదులు, దారాలను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఈ దిశలు ప్రతికూల శక్తి ప్రవాహంతో సంబంధం కలిగి ఉంటాయి. అక్కడ ఉంచితే అనారోగ్యాలు, అప్పులు, కష్టాలు, బాధలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
Do not mix needles and threads: సూదులు, దారాలను వేరుగా ఉంచాలి. వాటిని కలపకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటిని కలపడం వల్ల గందరగోళం, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అది ఇంట్లో సభ్యులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
Dispose : ఉపయోగించిన సూదులు, దారాలను సరిగ్గా పారవేయడం ముఖ్యం. ఎందుకంటే అవి నెగెటివ్ ఎనర్జీని మోసుకెళ్లగలవు. సరిగ్గా పారవేయకపోతే హానికరం అవుతాయి.
0 Comments:
Post a Comment