ఖాళీ జేబు, పర్స్ జీవితం గురించి చాలా నేర్పుతాయి.
డబ్బుతో అవసరాలు తీర్చుకోవడం కాదు, కోరికలు కూడా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనప్పుడు, సంపాదన కరవైనప్పుడు కష్టాలు నిండుగా ఉంటాయి, పర్స్ ఖాళీగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలనే కసి కష్టాల నుంచే పుడుతుంది.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. పర్స్ లేదా వాలెట్, ఆర్థిక పరిస్థితి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. మీ వాలెట్ రంగు మీ ఆర్థిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం, డబ్బు, విజయం, వృద్ధి, శ్రేయస్సు అందించే వాలెట్ కలర్స్‌ను పరిశీలిద్దాం.
* ఆరెంజ్ : ఇది ఉత్సాహం, విజయం, పాజిటివిటీతో ముడిపడి ఉన్న శక్తివంతమైన కలర్. ఇది సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఈ కలర్ వాలెట్‌ను అదృష్టంగా భావిస్తారు. ( PC : Amazon)
* రెడ్ : ఈ కలర్ కీర్తి, శ్రేయస్సును సూచిస్తుంది. డబ్బు, సమృద్ధిని ఆకర్షిస్తుంది. కానీ ఇది అగ్ని మూలకం రంగు కాబట్టి, ఖర్చులను కూడా పెంచుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ రంగు పర్సు వాడుకోవచ్చు. రెడ్ అనేది అభిరుచి, శక్తితో ముడిపడి ఉన్న శక్తివంతమైన కలర్. రెడ్ కలర్ వాలెట్ తీసుకువెళ్లడం వల్ల అదృష్టం, ఆర్థిక విషయాలలో విజయం లభిస్తుందని నమ్ముతారు. ఈ కలర్‌కి మూల చక్రంతో కూడా సంబంధం ఉంటుంది, ఇది స్థిరత్వం, భద్రతను సూచిస్తుంది. ( PC : Amazon)
* గ్రీన్ : గ్రీన్ కలర్ పాజిటివిటీ, జీవితం, అభివృద్ధిని సూచిస్తుంది. డబ్బు రావడం మెరుగవడంతోపాటు అభివృద్ధిని కోరుకుంటుంటే, గ్రీన్ కలర్ పర్స్ అదృష్టంగా మారుతుంది. గ్రీన్ అభివృద్ది, పునరుద్ధరణ, శ్రేయస్సును సూచిస్తుంది. గ్రీన్ వాలెట్ సంపద, విజయాన్ని ఆకర్షించగలదని నమ్ముతారు. గ్రీన్‌తో అనాహత చక్రం(Heart Chakra)తో సంబంధం ఉంటుంది. ఇది ప్రేమ, కరుణ, సమృద్ధిని సూచిస్తుంది. ( PC : Amazon)
* ఎల్లో : పసుపు సూర్యుని రంగు, ఇది సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా ఉంటుంది. ఆనందం, పాజిటివిటీతో కూడా ముడిపడి ఉంది. ఈ కలర్ వాలెట్ వినియోగించడం మంచి చేస్తుంది.
* బ్రౌన్ : ఇది భూమి మూలకాన్ని సూచిస్తుంది. సంపదలో మరింత స్థిరత్వాన్ని తీసుకురాగలదు, ఆదాయం, ఖర్చులలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ( PC : Amazon)
* బ్లూ : బ్లూ కలర్ శాంతి, ప్రశాంతత, స్థిరత్వాన్ని సూచిస్తుంది. బ్లూ కలర్ వాలెట్ వినియోగించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తుందని నమ్ముతారు. బ్లూ కలర్‌కి విశుద్ధ చక్రం(Throat Chakra)తో సంబంధం ఉంటుంది. ఇది కమ్యూనికేషన్, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను సూచిస్తుంది. ( PC : Amazon)
0 Comments:
Post a Comment