Upcoming Bikes: ఏప్రిల్ రాబోతున్న బైక్స్ ఇవే.. బైక్ లవర్స్ కి ఇక పూనకాలే!!
మారిన నూతన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా ఏప్రిల్ నుంచి రాబోయే వాహనాలన్నీ కొత్త మార్గ నిర్దేశకాల ప్రకారం విడుదల కానున్నాయి. బీఎస్6 ఫేస్ 2 ఎమిషన్ నిబంధనలను ఏప్రిల్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది.
అందుకు తగినట్లుగా 2 వీలర్ కంపెనీలు నూతన నియమాల ప్రకారం మార్కెట్లో సరికొత్త వాహనాలను తీసుకువస్తున్నాయి. ఏప్రిల్ లో రాబోతున్న స్కూటర్/మోటార్ సైకిళ్లపై ఓ లుక్కేద్దాం.
ఏప్రిల్ నెలలో మొత్తం అధికారికంగా నాలుగు బైక్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. రెండు పెర్ఫామెన్స్ మిడిల్ వెయిట్ మోటార్‌సైకిళ్లు, మాస్-మార్కెట్ పెట్రోల్ కమ్యూటర్, ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడళ్లపై అధికారిక తేది ప్రకటించనప్పటికి తేదీలలో కొద్దిగా మార్పులుండే అవకాశం ఉంది. ఆ వెహికిల్స్ కి సంబంధించిన సమాచారం మీకోసం..
హోండా H-స్మార్ట్ యాక్టీవా..
ఈ జాబితాలో ముందుగా విడుదల కానున్న స్కూటర్ హోండా యాక్టీవా 125 H-స్మార్ట్. ఏప్రిల్‌లో తొలుత లాంచ్‌కానున్న 2 వీలర్స్‌లో హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్ ఒకటి. ఈ స్కూటీకి సంబంధించిన వివరాలు ఇటీవలే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆటో లాక్/ అన్‌లాక్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి ఫీచర్స్ తో ఈ స్కూటర్ అందుబాటులోకి వస్తుంది.
అధునాతన డిజైన్ ఫీచర్లతో ఈ స్కూటర్ రానుంది. 125 డిజైన్ స్టైలింగ్‌లో ఎటువంటి మార్పులను సంస్థ ప్రకటించలేదు. అయితే ఈ స్కూటర్ అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ వెనుకవైపు ఒకే షాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెనుకవైపు డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లతో రానుంది. ఈ స్కూటర్ అత్యాధునిక కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ను కూడా పొందుతుంది. ఇది సడెన్ బ్రేకింగ్ కి సహకరించనుంది.
డుకాటీ..
2023లో 9 బైక్స్‌ని లాంచ్ చేయనున్నట్టు గతేడాదే ప్రకటించింది డుకాటీ ఇండియా. ఇందులో భాగంగా.. డుకాటీ మాన్‌స్టర్ ఎస్పీనీ తొలుత లాంచ్కానుంది. ఏప్రిల్ నుంచి ఈ ఏడాది రెండో భాగం మధ్యలో ఇది మార్కెట్లోకి అడుగుపెడుతుందని సమాచారం.
2023లో దేశంలోకి తొమ్మిది మోటార్‌సైకిళ్లను తీసుకువస్తామని డుకాటీ ఇండియా గత సంవత్సరం ప్రకటించింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉన్న మొదటి మోడల్ డుకాటి మాన్‌స్టర్ SP. స్ట్రీట్‌ఫైటర్ మరింత పనితీరుకు అనుకూలమైన వెర్షన్ ప్రామాణిక వెర్షన్‌లో చేరనుంది. ఇది స్టాండర్డ్ మాన్‌స్టర్ కంటే 2 కిలోల బరువు తక్కువగా ఉంటుంది.
బ్రెంబో స్టైల్మా బ్రేక్ కాలిపర్‌లు, పూర్తిగా సర్దుబాటు చేయగల ఓహ్లిన్స్ సస్పెన్షన్, రోడ్-హోమోలోగేటెడ్ టెర్మిగ్నోని స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్ తో పాటు మరిన్ని మెరుగైన హార్డ్‌వేర్‌ను ఈ బైక్ పొందుతుంది. Ducati ఇప్పటికే మాన్‌స్టర్ SP ధరను వెల్లడించింది. మార్కెట్ లో ఈ బైక్ ధర రూ.15.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ట్రయంఫ్ స్ట్రీట్ R & RS..
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా మార్చిలో మొదటగా R & RS మొదటగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. చివరి నిమిషంలో 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ R & RS యొక్క ప్రారంభ తేదీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ R & RS మోడల్‌ను మునుపటి కంటే మరింత శక్తివంతం చేస్తూ వివిధ అప్‌గ్రేడ్‌లతో ఈ ఏప్రిల్ లో తీసుకురానుంది.
సింపుల్ వన్..
ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఒకటైన సింపుల్ వన్ ఎట్టకేలకు ఏప్రిల్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.తమిళనాడులో ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రం ద్వారా ఈ అధునాతన స్కూటర్ అందుబాటలోకి రానుంది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న మోడల్‌లను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ సన్నిహిత వర్గాలు ఇటీవలే వెల్లడించాయి.
సింపుల్ వన్ బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ రేంజ్ ని అందిస్తుందని మార్కటె నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. మోడల్ ధరను కూడా సంస్థ వెల్లడించలేదు. ఒకసారి మార్కెట్ లోకి విడుదలయ్యాక దీనిని ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment