ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు..! 'బతికి ఉంటే బలుసాకు తిని అయినా గడిపేయవచ్చు' అని అందుకే అంటారు.. కరోనా విషయంలో అది ప్రూవ్ అయ్యింది కూడా..
దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ జర్నీపై 'హిస్టరీ TV18' రూపొందించిన డాక్యుమెంటరీ 'ద వయల్'(The Vial) అనేక విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. రాత్రి 8గంటలకు హిస్టరీ TV18లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది..
ముఖ్యంగా దేశంలో కరోనా కాలు దువ్వుతున్న సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.. మోదీ అప్పుడు ఆ డిసిషన్ తీసుకోకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవోనని తలచుకుంటున్నారు.
లాక్‌డౌన్ సొల్యూషన్:
కరోనా వైరస్ విషయంలో లాక్‌డౌన్ అవసరాన్ని గుర్తించి ఇళ్లకే పరిమితం అవడం మినహా మనకు మరో ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు... మార్చి 24,2020 లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యేలా చేశారు..సమస్య కరోనాపై గెలుపు, ఓటములది కాదని.. చావు బతుకలదని మోదీ చెప్పిన సందర్భమది.. వైరస్ విసురుతున్న విషపు వలలో చిక్కకుండా తప్పించుకోవడమే తప్ప వేరే మార్గం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చేయడంతో మోదీ సక్సెస్ అయ్యారు.
ఇదే లాక్‌డౌన్ విషయాన్ని హైలెట్ చేస్తూ 'ద వయల్' డాక్యుమెంటరీలో చూపించారు. మోదీ అనౌన్స్ చేసిన వ్యాఖ్యలు.. తర్వాత లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించిన విధానాన్ని వివరించారు.
వ్యాక్సిన్ వచ్చేలోపు లాక్‌డౌన్ అస్త్రం:
మొత్తం జీవ ప్రపంచంలో మనుషులకే భావోద్వేగాలు ఎక్కువ! కుటుంబ సాహచర్యం, సాంఘీక జీవితం ఎక్కువ. బయటకు వెళ్తే కానీ పూట గడవని దుస్థితి చాలామందిది.. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం సాధ్యమా..? మొదట్లో అందరి మెదళ్లలో ఇదే ప్రశ్న.. అయితే మోదీ లాక్‌డౌన్ నిర్ణయానికి ప్రజల సహాకరం తోడైంది.. అందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు.. బతకడం తప్ప మరో లక్ష్యం లేదన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది.. వ్యాక్సిన్ రావడానికి ఎలాగో ఏడాది పడుతుందని.. ఈలోపు లాక్‌డౌన్‌తో వైరస్ నుంచి ప్రజలను కాపాడొచ్చన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన సక్సెస్ అయ్యింది.. ఇదే విషయాన్ని 'ద వయల్' డాక్యుమెంటరీలో వివరించారు.
లాక్‌డౌన్ విషయంలో ప్రజలు పడ్డ బాధలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించిందీ డాక్యుమెంటరీ. ఇక అదే సమయంలో వేలాది మంది సైంటిస్టులు కొవిడ్‌కు విరుగుడు కనిపెట్టే విషయంలో తలమునకలైన విషయాన్ని ప్రస్తావించారు.
కరోనా లాంటి వైరస్ విరుగుడుకు దిర్ఘ కాల ప్రణాళిక అవసరమని.. వ్యాక్సిన్ డోసుల పంపిణీ పెరిగే వరకు లాక్‌డౌనే మార్గమన్న విషయాన్ని వివరించారు.
0 Comments:
Post a Comment