పన్ను ఆదా కోసం ఉద్యోగులు ప్రతీ సంవత్సరం ఏం చేయాలా అని తలలు పట్టుకుంటారు. పన్ను ఆదా స్కీములు అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టేస్తుంటారు. పన్ను రహిత పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ప్రయత్నిస్తారు.
వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఆదా చేసేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఎంత సంపాదించినా పన్ను కట్టాల్సిన అవసరం లేదు అనే రూల్ ఉంటే మనం ఎగిరి గంతేయడం ఖాయం. కానీ అలాంటి నిబంధన మనదేశంలోనే ఓ రాష్ట్రంలో అమల్లో ఉంది. అవును సిక్కిం ప్రాంత ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
సిక్కిం పన్ను రహిత రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమల్లో ఉంది. ఇక్కడి స్థానికుల జీతం ఎంత అయినప్పటికీ, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇక్కడ ఆదాయపు పన్ను మాత్రమే కాకుండా ప్రత్యక్ష పన్ను కూడా చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ, వారికి ప్రభుత్వం నుంచి అన్ని సేవలు అందుతాయి.
భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, ప్రతి పౌరుడు తన ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలి. సిక్కింలో ఈ చట్టం అమలు కాలేదు. భారత రాజ్యాంగంలోని 372(ఎఫ్) ప్రకారం, సిక్కిం నివాసితులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ నియమం సిక్కిం నివాసితులందరికీ వర్తించదు. సిక్కింలోని అసలైన నివాసితులకు మాత్రమే పన్ను నుండి మినహాయింపు ఉంది.
సిక్కిం ప్రజలు ఎందుకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు..
సిక్కిం ఇంతకుముందు భారతదేశంలో భాగం కాదు. భారతదేశానికి స్వాతంత్రానికి ముందు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ, సిక్కిం, భూటాన్‌లను హిమాలయ రాష్ట్రాలుగా మార్చాలని ప్రయత్నించారు. 1950లో సిక్కిం-భారత్ శాంతి చర్చలు జరిగాయి.
సిక్కింపై ఎలాంటి దాడి జరిగినా భారత్ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో సిక్కిం కూడా భూటాన్ లాగా ప్రత్యేక దేశం. సిక్కింలో అంతకుముందు స్వతంత్ర పాలకులు ఉన్నారు.
1975లో సిక్కిం భారతదేశంలో భాగమైంది. భారతదేశంలో, పన్ను నియంత్రణ చట్టం, 1949 నుంచి అమల్లో ఉంది. అప్పటికి సిక్కిం భారతదేశానికి చెందిన రాష్ట్రం కాదు. 1975లో సిక్కిం భారతదేశంలో భాగమైనప్పటి నుండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారు.
సిక్కింలో ఎలాంటి ఆదాయపు పన్ను నిబంధనలు అమలులో ఉన్నాయి?:
సిక్కిం భారతదేశ రాష్ట్రంగా అవతరించినప్పుడు, సిక్కింలోని అసలు నివాసితులు పేరిట కొన్ని నిబంధనలను విధించారు. వారికి మాత్రమే ఈ పన్ను మినహాయింపు కూడా ఉంది. సిక్కింలో సెక్షన్ 10 (26AAA) అమలులో ఉంది. ఇక్కడ నివాసితులకు పన్ను విధించబడదు.
2008 వరకు, ప్రత్యేక పౌరసత్వ ధృవీకరణ పత్రాలు కలిగిన నివాసితులు మాత్రమే పన్నుల నుండి మినహాయించబడ్డారు. కానీ 2008 తర్వాత సిక్కింలోని అసలు నివాసులందరూ ఇందులో చేర్చారు.
1975కి ముందు నుండి సిక్కింలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు పన్ను మినహాయింపు పొందుతారు.
మరోవైపు, సిక్కిం నివాసి అయిన మహిళ సిక్కిం నివాసి కాని వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆమెకు పన్ను మినహాయింపు లభించదు.
ఆర్టికల్ 371A అన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తుంది.ఈ నిబంధన కింద పన్ను మినహాయింపు పొందిన ఏకైక రాష్ట్రం సిక్కిం కావడం విశేషం.
0 Comments:
Post a Comment