సమయం ప్రపంచంలో అత్యంత విలువైన, శక్తివంతమైన విషయం. గడిచిన కాలం జీవితంలో మళ్ళీ మీకు తిరిగి రాదు. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. అది మీ జీవితానికి సంబంధించిన అన్ని గాయాలను నయం చేస్తుంది.
మీకు కావలసిన విజయాన్ని ఇస్తుంది. కనుక జీవితంలో సమయాన్ని దుర్వినియోగం చేయవద్దు. సమయాన్ని గౌరవించే వ్యక్తి తాను చేసే పని రేపటికి వాయిదా వెయ్యరు. పనిని రేపటి కోసం వదిలిపెట్టడు.
నిన్నటిది, నేటిది కూడా ఇప్పుడే చేయాలి అని చెప్పారు. ఎందుకంటే నెక్స్ట్ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.
సమయానికి మంచి చెడులుండవు. ఎవరిజీవితంలోనైనా మంచి లేదా చెడు జరగాలంటే అది మీ విజయం, వైఫల్యం మీద ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం.. దుర్వినియోగం చేయడంపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఏదైనా పని చేయాలనిపించినప్పుడు.. అయ్యో సమయం అయిపొయింది అంటూ చింతిస్తారు. అయితే మీరు చింతిస్తున్నప్పుడు కూడా మీ సమయం అయిపోతోందని మీరు గమనించాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క గంట కూడా వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయానికి సంబంధించిన 5 విలువైన సూత్రాల గురించి తెలుసుకుందాం..
జీవితం సంతోషంగా, సుసంపన్నంగా ఉండాలంటే.. సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి.
అదృష్టవంతులకు సమయం గురించి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సమయం గురించి అర్థం చేసుకునే సమయానికి, అతని విలువైన సమయం గడిచిపోయింది.
సమయం అనేది కనిపించక పోవచ్చు కానీ మనిషికి చాలా కనిపిస్తుంది. అతను ఉపాధ్యాయుడు కాకపోవచ్చు కానీ మనిషికి చాలా నేర్పిస్తుంది.
మీ ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోనంత వరకు, మీ సమయం యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోలేరు. మీ సమయం యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోనంత వరకు, మీరు జీవితంలోని ఏ రంగంలోనూ విజయం సాధించలేరు.
సమయం చాలా విలువైనది, మీరు మీ యవ్వనంలో కాలం విలువ తెలుసుకుని మసలుకోక పోతే.. అనవసరమైన విషయాల కోసం వృధా చేస్తే.. మీరు వృద్ధాప్యంలో పశ్చాత్తాపపడటానికి ఏమీ మిగలదు.
0 Comments:
Post a Comment