Stepney size: కారుకు సంబంధించిన కొన్ని విషయాలు భలే ఆసక్తిగొలుపుతుంటాయి. వీటిలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అదేవిధంగా కారులో ఉండే స్టెప్నీ(stepney)కి సంబంధించి ఆసక్తికర విషయమొకటుంది.
ఇది కారులోని నాలుగు టైర్లకు భిన్నంగా ఉంటుంది. దాని పరిమాణం(size), బరువు సాధారణ టైర్ల మాదిరిగా ఉండదు. ఇలా ఎందుకు ఉంటుంది? వాహన తయారీ కంపెనీలు(Vehicle manufacturing companies) ఎందుకు స్టెఫ్నీలను ఇలా తయారు చేస్తాయనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది.
వీటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టైర్లు అత్యవసర సమయం(Emergency time)లో ఉపయోగపడతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అల్లాయ్ వీల్స్(Alloy wheels) ఉన్న కార్లు సాధారణ స్టెప్నీని కలిగి ఉంటాయి.
కొన్ని కార్లలో ముందు, వెనుక ఉన్న నాలుగు టైర్ల పరిమాణం R15గా ఉంటుంది. స్టెప్నీ టైర్(Stepney Tyre) పరిమాణం R14గా ఉంటుంది.
ఈ స్పేర్ టైర్ అత్యవసరం కోసం మాత్రమే రూపొందించారు. ఈ టైర్లు పరిమాణంలో కాస్త చిన్నగా ఉండటమే కాకుండా తేలికగానూ ఉంటాయి. దీని నిర్దిష్ట కారణం గురించి ఏ కంపెనీ వెల్లడించలేదు.
అయితే డిగ్గీలో తక్కువ స్థలం(Less space) ఉండటం వల్ల, దాని డిజైన్‌ను అలా రూపొందించినట్లు చాలా నివేదిక(Report)లలో పేర్కొన్నారు.
అదే సమయంలో తేలికగా ఉండటం వెనుక ఉన్న వివరణ(Description) ఏమిటంటే డిగ్గీలో బరువును తగ్గించడం. దీని కారణంగా ఈ టైర్ రిమ్ బరువు(weight) తగ్గుతుంది.
అయితే ఈ స్టెప్నీ సాయంతో ఎక్కువ దూరం ప్రయాణించకూడదని, ఎక్కువ కాలం దానిని ఉపయోగించకూడదని ఆయా కార్ల కంపెనీలు సూచిస్తుంటాయి.
అలాగే కారును స్టెప్నీ సాయంతో నడిపేటప్పుడు స్పీడ్(Speed) తక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆయా కంపెనీలు సూచిస్తుంటాయి.
అదేవిధంగా స్టెఫ్నీ(Stephanie) తక్కువ బరువు ఉన్న కారణంగా దానిని మార్చడం(change) తేలిక అవుతుందనే వివరణ కూడా వినిపిస్తుంది.
0 Comments:
Post a Comment