కొంతమంది జీవితంలో ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్నిసార్లు కష్టపడి సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది.
డబ్బుకు సంబంధించిన ఆలోచనలు మనిషిని మరింత ఆందోళనకు గురిచేస్తాయి. దీని వెనకున్న అనేక కారణాలున్నాయని చెబుతోంది వాస్త శాస్త్రం.
ముఖ్యంగా ఇంటి స్థానం, ఇంట్లో వస్తువులు, ఇంట్లో డబ్బు ఉంచే ప్రాంతం ఇవన్నీ కూడా వాస్తును తెలియజేస్తాయి.
వీటిలో ఏది లోపించినా ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఇంట్లో ముఖ్యంగా అల్మారాలో డబ్బులు ఉంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో అల్మారా వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంది…ఏ దిశలో ఉండాలి. ఈ విషయాలను తెలుసుకుందాం.
అల్మారా ఏ దిశలో ఉండాలి:
వాస్తుశాస్త్రం ప్రకారం, గది దక్షిణ గోడకు సమీపంలో అల్మరా ఉంచాలి. గది తలుపులు తెరిచినప్పుడు ఉత్తరం వైపు తెరుచుకునే విధంగా ఉంచాలి. అటువంటి స్థితిలో, సంపద, శ్రేయస్సు రెండూ సులభంగా వస్తాయి.
అల్మారాలో ఎలాంటి వస్తువులు ఉంచాలి..
సంపదను పెంచే వస్తువులు:
వాస్తుశాస్త్రం ప్రకారం, సంపదను పెంచే వస్తువును అల్మారాలో ఉంచాలి. మీరు దానిని అల్మారాలో లేదా ఖజానాలో ఉంచవచ్చు. వాస్తు నిపుణుల సలహా మేరకు శుభ్రమైన ఎర్రటి గుడ్డలో డబ్బు ఉంచి పూజ చేసి అల్మారాలో ఉంచుకోవచ్చు. దీని వల్ల డబ్బు అనవసరంగా ఖర్చు కాదు.
తమలపాకు, కొబ్బరికాయ:
హిందూ మతంలో కొబ్బరికాయ లక్ష్మీదేవికి, తమలపాకు గణేశుడికి ప్రతీక. ఫలితంగా డబ్బు ఉంచే అల్మారాలో ఈ రెండు వస్తువులను ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
భూర్జపాత్ర:
హిందూ గ్రంధాలలో భూర్జపాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముందుగా, బొద్దుగా ఉండే భూర్జపాత్ర తీసుకోండి.
తర్వాత గంగాజలాన్ని ఒక పాత్రలో తీసుకుని ఎర్రచందనం అక్కడ వేయండి. దానిని తీసుకుని నెమలి ఈకతో భూర్జపత్రంపై ‘శ్రీ’ అని రాయండి. అప్పుడు దానిని అల్మారాలో ఉంచండి.
చింతపండు:
హిందూ మతంలో చింతపండును పవిత్రంగా భావిస్తారు. చింతపండు తీసుకుని, అందులో వెండి, రాగి నాణెం వేయండి.
పసుపు గుడ్డలో వీటిని ఉంచి అల్మారాలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు, సంపదలు లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment