Spinach Heath Benefits: పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర తినడం వల్ల కంటి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది , రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది.
పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచచడానికి సహాయపడుతుంది, ఇది మీ శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది.
ఫోలేట్ లేదా విటమిన్ B9 అని కూడా పిలుస్తారు, పాలకూరలో సహజంగా లభించే ఈ సమ్మేళనం గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనది.
ఇందులో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే, రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
పాలకూరను అనేక రకాలుగా వండుకోవచ్చు. దీనిని మీ బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకోవాలంటే కూడా వివిధ రకాల అల్పాహారాలు సిద్ధం చేసుకోవచ్చు. పాలకూరతో చేసే పాలక్ ఊతప్పం రెసిపీని ఇక్కడ అందించాం చూడండి.
Spinach Uttapam Recipe కోసం కావలసినవి
1 కప్పు సెమోలినా (రవ్వ)
1 కప్పు పాలకూర ప్యూరీ
1/2 కప్పు పెరుగు
1/2 స్పూన్ అల్లం పేస్ట్
1/2 స్పూన్ ఫ్రూట్ సాల్ట్
5 టేబుల్ స్పూన్ల నూనె
ఉప్పు రుచికి తగినంత
1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
1 tsp సన్నగా తరిగిన పచ్చిమిర్చి
1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర
పాలకూర ఊతప్పం తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో రవ్వ, పాలకూర ప్యూరీ, పెరుగు, కొన్ని నీళ్లు వేసి బాగా కలపాలి.
ఆపైన నాన్-స్టిక్ తవా వేడి చేసి, కొద్దిగా నూనెతో గ్రీజు చేయండి.
తరువాత తవా మీద ఒక గరిట పిండిపోసి లైట్ గా వత్తుకోవాలి.
పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి.
మీడియం మంట మీద 1 నిమిషం ఉడికించాలి. రెండు వైపులా కాల్చుకోవాలి.
అంతే, పాలకూర ఊతప్పం రెడీ.. గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.
0 Comments:
Post a Comment