Sone Bhandar: భారతదేశంలో సైన్స్ కి సైతం అంతుచిక్కని ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి. అందులో బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని రాజ్ గిర్ లో ఉన్న బంగారు నిక్షేపం గని కూడా ఒకటి.
దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అక్కడ జనం చెబుతుంటారు.. హర్యాంక రాజవంశం స్థాపకుడు బింబిసారుడు.. తన భార్య బంగారాన్ని ఇక్కడే దాచి పెట్టాడని.. అది ఇంతవరకు ఇక్కడి ప్రజల కంటపడలేదని.. కనీసం ఆ బంగారు నిక్షేపాలున్న గదిని కూడా ఎవరు చేరుకోలేకపోయారని నానుడి ఉంది. దీన్ని అక్కడి వాళ్లంతా “సోన్ భండార్”అని పిలుస్తుంటారు.
importance of Sone Bhandar
హరియాంకా రాజ వంశ స్థాపకుడు బింబిసారుడికు.బంగారం, వెండి నగలు అంటే ఎంతో ఇష్టమని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. బీహార్ లోని ఈ గుహలో హరియాంకా రాజవంశానికి చెందిన నగలు మరియు వజ్ర వైఢూర్యాలతో కూడిన నిధిని దాచి పెట్టారని చరిత్ర చెబుతోంది.
అయితే ఈ నిధిని కాజేసేందుకు బ్రిటిష్ వాళ్ళు సైతం ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ బంగారు నిధిదాచి ఉంచిన ప్రదేశాన్ని హర్యాంక రాజవంశ స్థాపకుడు బింబిసారా తన భార్య కోసం నిర్మించాడు.
నాటి నుంచి నేటి వరకు ఈ బంగారు నిధిలో ఉన్న నిక్షేపాల గురించి తెలుసుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు.. అయినప్పటికీ వచ్చిన వాళ్లంతా ఈ అంతుచిక్కని రహస్యం తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు.
హర్యాంకా రాజవంశ స్థాపకుడైన బింబిసారకు బంగారం, వెండితో గొప్ప అనుబంధం ఉందని చరిత్ర చెబుతోంది.
అజాతశత్రువు తన తండ్రిని బంధించి జైలులో పెట్టినప్పుడు.. బింబి సారుని భార్య రాజ్ గిర్ లో ఈ బంగారం నిధిని నిర్మించిందని నానుడి ఉంది.
రాజ సంపదలన్నీ ఈ గుహలోనే దాగి ఉన్నాయి. ఈ గది ఎత్తు సుమారు 1.5 మీటర్లు ఉంటుంది. అయితే బ్రిటిష్ హయాంలో ఫిరంగి బాల్స్ తో గుహ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాలానుగుణంగా ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ గుహ యొక్క నిజం నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది.
గుహ గోడపై ఇంకా చదవని ఎన్నో రహస్య శాసనాలు కూడా ఉన్నాయి. ఈ శాసనాలను చదివిన వారికి నిధికి మార్గం దొరుకుతుందని స్థానిక ప్రజలు నమ్ముతుంటారు..
0 Comments:
Post a Comment