మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ పాస్‌వర్డ్‌తో ఆన్ చేసి, గ్యాస్ లీక్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతే, అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
ఇది డిజిటల్ యుగం, ఇప్పుడు సాధ్యం కానిది ఏదీ లేదు.
బీహార్‌కు చెందిన 13 ఏళ్ల ప్రత్యూష్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మాధేపురా నివాసి ప్రత్యూష్ అలాంటి గ్యాస్ స్టవ్‌ను తయారు చేశాడు, ఇది పాస్‌వర్డ్‌తో ఆన్ అవుతుంది, గ్యాస్ లీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది.
గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. కొన్ని సెకన్లకు మించి గ్యాస్ లీక్ అయితే ఆటోమేటిక్‌గా ఇంటి మొత్తం కరెంటు కూడా ఆగిపోవడం ఇందులోని స్పెషాలిటీ. ఇది మూడు వేల రూపాయలకే ప్రజలకు అందేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ గ్యాస్ స్టవ్ తో ఒక అలారం అమర్చి ఉంటుంది. ఇది గ్యాస్ లీక్ అయినప్పుడు మోగుతుంది. అంతేకాకుండా గ్యాస్ లీక్ అయితే, వంటగదిలో మొదట అమర్చిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ అవుతుంది.
కాసేపటి తర్వాత.. ఇంటికి విద్యుత్ ఆగిపోతుంది. ఇక రెగ్యులేటర్‌కు గ్యాస్ కనెక్షన్ ఆగిపోతుంది. దీన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు 1,500 రూపాయలు అయ్యిందట. అయితే మార్కెట్‌లో రూ.3,000 వరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు గ్యాస్ లీక్ ఐనప్పుడు కంగారు పడకుండా ఏం చేయాలో తెలుసుకోండి. గ్యాస్ వాసన వస్తే, భయపడవద్దు. వంటగదిలో.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌లను ఆన్ చేయవద్దు.
వంటగది, ఇంటి కిటికీలు, తలుపులు తెరవండి. రెగ్యులేటర్ ఆన్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ ఆన్ లో ఉంటె వెంటనే దాన్ని ఆఫ్ చేయండి. రెగ్యులేటర్‌ని ఆపివేసిన తర్వాత కూడా రెగ్యులేటర్‌ని తీసి సేఫ్టీ క్యాప్ ని పెట్టండి.
నాబ్‌ను కూడా బాగా తనిఖీ చేయండి. గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవడానికి.. రెగ్యులేటర్ అదేవిధంగా గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.
పైపు కొంచెం చెడిపోయినట్లయితే, వెంటనే దాన్ని మార్చండి. అయితే ఇలాంటి స్టెప్స్ ఏమీ లేకుండా అన్ని పనులు ఆటోమెటిక్ గా ఐపోయేలా గ్యాస్ లీక్ ప్రమాదానికి సొలూష్యన్ కనిపెట్టాడు 13ఏళ్ల ప్రత్యూష్.
0 Comments:
Post a Comment