Show cause - హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నర్సీపట్నం: విధి నిర్వహణలో అలసత్వం వహించిన ముగ్గురు హెచ్‌ఎంలు, నలుగురు ఉపాధ్యాయులకు డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్ ఆదివారం షోకాజ్‌నోటీసులు జారీ చేశారు.
పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు జేసీ కల్పనా కుమారి కృషి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం అమలు తీరు పర్యవేక్షణలో భాగంగా డిప్యూటీ డీఈవో నర్సీపట్నం మండలంలోని పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్(మెయిన్), జిల్లా పరిషత్ హైస్కూల్(తురకబడి), ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చెట్టుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. ఒక్క బొడ్డేపల్లి స్కూల్ మినహా మిగిలిన పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ హైస్కూల్(తురకబడి) సోషల్ టీచర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, పీఎస్, సోషల్ టీచర్లు, చెట్టుపల్లి హెచ్‌ఎం, జిల్లా పరిషత్ హైస్కూల్(మెయిన్) హెచ్‌ఎం, సోషల్ టీచర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
0 Comments:
Post a Comment