Sheetla Mata Temple: ఈ గుడికి వెళ్లే చాలు.. ఆ వ్యాధులు వెంటనే తగ్గిపోతాయట.. విదేశాల నుంచీ భక్తుల రాక
దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ఊరిలో కూడా ఏదో ఒక గుడి ఉంది. దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనే.. అందరూ భగవంతుడిని ఆరాధిస్తున్నారు. నిత్యం పూజలు చేస్తున్నారు.
ఒక్కోసారి దేవుడు కూడా తమ భక్తులకు అద్భుతాలను చూపిస్తాడు. లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నా.. కొన్ని ఆలయాలు మాత్రం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అక్కడ కొలువై ఉన్న దేవుడు ఎంతో మహిళ గలవారని భక్తులు విశ్వసిస్తారు. బీహార్ (Bihar)లోని పూర్నియా జిల్లాల్లో కూడా అలాంటి అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది. అదే.. మాతా శీతల మందిరం (Sheetla Mata Temple). పూర్నియా జిల్లా బిల్లోరిలోని శ్రీ కృష్ణ పురి వార్డ్ నెం. 44లో ఈ గుడి ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే...తట్టు (Smallpox), ఎస్ఎస్‌డీ (SSD disease) వంటి రోగాలు తగ్గిపోతాయట.
మాతా శీతల మందిర కమిటీ అధ్యక్షుడు ప్రమోద్ దేవనాథ్ మాట్లాడుతూ... 1948లో మాతా శీతల మందిరం నిర్మితమైందని చెప్పారు. ఈ ఆలయం పూర్నియా, సీమాంచల్ ప్రాంతాలలో వేలాది మంది ప్రజలు తట్టు మహమ్మారితో ఇబ్బంది పడినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారట. అనంతరం శీతలా దేవి పూజ కోసం స్థానిక నివాసి రోహిణి కవిరాజ్ ద్వారా పిలుపు వచ్చిందట. స్థానికులు గుడికి వచ్చి.. అమ్మవారిని దర్శిచుకున్న తర్వాత... తమకున్న తట్టు వ్యాధి తగ్గిపోయిందట. అందుకే అప్పటి నుంచి ఈ ఆలయానికి మశూచితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఎంతో మంది వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారి రోగాలు తగ్గుతాయని విశ్వాసం.
శీతలా దేవి పాదాల చెంతన ఉన్న నీటికి ఎంతో మహిమ ఉందని ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక గ్రామస్తులు పవన్ కుమార్ యాదవ్, రిటెంకా సర్కార్, కుందన్ షా, ప్రహ్లాద్ దాస్ సహా ఇతర గ్రామస్తులు తెలిపారు. ఆలయంలో శీతలా మాతను దర్శించుకొని వెళ్లిన తర్వాత.. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వెల్లడించారు.
ఆలయ పూజారి మంత్రాలు పఠించిన అనంతరం.. అమ్మవారి పాదాల వద్ద ఉన్న నీటిని తీసుకొని.. తట్టు బాధితులు, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిపై చల్లుతారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వ్యాధులు నయమవుతాయని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ మహిమ వల్లే బీహార్ , ఇతర రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వచ్చి.. శీతల దేవి అమ్మవారికి పూజలు చేస్తారట.
బెలౌరి నివాసి రోహిణి యువరాజ్ శీతలా దేవి ఆలయాన్ని 1948లో స్థాపించారు. ఇక్కడ ప్రతి ఏటా శీతల పూజ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. బీహార్, యూపీతో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి ఎంత మంది ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు వస్తారు. అమ్మవారి దర్శించుకొని.. తమ కోరికలను తీర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment