Self Meter Reading : మీ విద్యుత్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. బిల్లు కట్టుకోవచ్చు..
అందరికీ ఇంటి విద్యుత్ మీటర్లు ఉంటాయి. ఈ మీటర్లలో వచ్చిన రీడింగ్ ఆధారంగా మనకు బిల్లు వస్తుంది. అయితే ఒక్కోసారి బిల్లు కొట్టే వారు రెండు మూడు రోజులు ఆలస్యంగా వస్తే మన విద్యుత్ వాడకం స్లాబ్ దాటిపోయి బిల్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
సరైన సమయానికి రీడింగ్ తీసుకున్న ఒకటి రెండు రోజులకు బిల్లు అన్ లైన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఒక్కోసారి బిల్లు కట్టడం మారిచిపోతారు. ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మనకు ఇష్టమొచ్చినప్పుడు బిల్లు కట్టుకోవచ్చు.
మీ విద్యుత్ మీటర్ రీడింగ్ మీరే స్కాన్ చేసుకోవడానికి ఒక యాప్ ఉంది. టీఎస్ఎస్పీడీసీఎల్ selfmeterreading పేరుతో Bharat Smart Services అనే యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ లో కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ మీటర్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ మీటర్ వద్దకు వెళ్లాలి. మీరు యాప్ లో కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ పై క్లిక్ చేయగానే స్కాన్ చేయమని ఉడుగుతుంది. మీరు మీటర్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది.
అన్ని వివరాలు సరిగా ఉంటే నెక్స్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ బిల్లు కనిపిస్తుంది. అందులో చెల్లింపు సదుపాయం కూడా ఉంది. https://play.google.com/store/apps/details?id=in.coral.met లింక్ పై క్లిక్ చేయడంతో భారత్ సెల్ఫ్ మీటర్ రీడ్డింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు స్కాన్ చేసి బిల్లు చెల్లించవచ్చు.
0 Comments:
Post a Comment