SBI Recruitment: బంపర్ నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే SBIలో ఉద్యోగం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో(SBI) ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నియమించనున్నారు.
రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్(Manager), ఎగ్జిక్యూటివ్ ఎడ్యూకేషన్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 15లోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.
అర్హతలు..
మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతో అనుభవం ఉండాలి.
మెదక్ ఆర్డినెన్స్ లో 438 ఉద్యోగాలు .. ">
వయో పరిమితి..
అభ్యర్ధుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనిలో షార్ట్‌లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముంబయి, ఎస్‌బీఐఎల్, కోల్‌కతాలో పోస్టింగ్ ఉంటుంది.
రీటైల్ మేనేజర్ పోస్టులు మొత్తం 5 ఖాళీగా ఉండగా..అభ్యర్థుల వయస్సు 28 నుంచి 38 మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. దీనికి సంబంధిత పనిలో అనుభవం 2 ఏళ్లు ఉండాలి.
ఫ్యాకల్టీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యూకేషన్ పోస్టులు మొత్తం 02 ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికి సంబంధిత పనిలో అనుభవం 3 ఏళ్లు ఉండాలి. దీనికి ఎంపికైన అభ్యర్థులు కలకత్తాలో పని చేయాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment