ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నవి సహజం. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దురదృష్టం అన్నది ఏదో ఒక సమయంలో వెంటాడుతూనే ఉంటుంది. దురదృష్టానికి ముఖ్య కారణం శని దోషం అని చెప్పవచ్చు.
ఒక వ్యక్తి జీవితంలో శని దేవుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే దురదృష్టం వెంటాడుతుంది. శని దేవుడి దయ లేకపోతే జీవితంలో విజయం సాదించలేడు. శని దేవుడు చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు.
శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. శని దేవునికి పూజ చేసేటప్పుడు కానీ అలాగే సమర్పించే దుస్తులు కేవలం నలుపు రంగులో మాత్రమే ఉండాలి.
శనికి నలుపు రంగు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అందుకే శనికి నలుపు రంగులో ఉండే వస్తువులనే సమర్పింస్తుంటారు.
అయితే ఒకవేళ జాతకంలో శని దోషాలు ఉంటే కొన్ని రకాల విషయాలను పాటించడం వల్ల అవి తొలగిపోయి సంతోషంగా ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషంతో బాధ పడుతుంటే శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లి మీ చెప్పులు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. అయితే మీరు అలా చేసినట్టు ఎవరికీ చెప్పకూడదు.
జాతకంలో శని సంబంధిత దోషాలను తొలగించడానికి మీ దగ్గర పని చేసే సేవకులను వీలైనంత సంతోషంగా ఉంచాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవ్వరికి బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి కూడా బూట్లు, చెప్పులు లాంటివి తీసుకోకూడదు.
మాములుగా పూజలో మనం ఎప్పుడు కూడా నలుపు రంగు ప్రాధాన్యత ఇవ్వము కాబట్టే శని దేవుడు నలుపు రంగును ఆయనకు ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు.
అప్పటి నుండి ఈయనకు నలుపు రంగులో ఉండే వస్తువులను సమర్పించడం మొదలయ్యింది.
జాతకంలో శని దోషం ఉంటే దానిని తొలగించడానికి రావి చెట్టుని పూజించాలి. రావి చెట్టును ప్రతి శనివారం పూజిస్తే శని దోషం తొలగి పోతుంది. కష్టాల నుండి విముక్తి పొందవచ్చు.
0 Comments:
Post a Comment