అన్నీ అనుకూలంగా ఉన్న చోట నిర్మాణాలు చేపడితే.. వింతేముంటుంది. సాధ్యం కాని చోట చేసి చూపించడం గొప్ప. అదే చేసి నిరూపించారు చైనా ఇంజనీర్లు.
నిర్మాణ సమయం, వ్యయం తగ్గించడానికి చైనా ఇంజినీర్లు చేసిన ఓ అద్భుత ప్రయోగం.. రివర్ హైవే.. దాన్ని చూసిన వారంతా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జిల నిర్మించడం సర్వసాధారణం.
కానీ చైనాలో నది మధ్యలోనే బ్రిడ్జిని నిర్మించి హైవే వేశారు. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి.
జింగ్‌షాన్ కౌంటీలోని గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం ఈ రివర్ హైవేనే నిర్మించింది. దీన్ని నది పొడవునా 4.4 కిలోమీటర్ల దూరం బ్రిడ్జిలతో హైవే నిర్మించింది. దాని నిర్మాణ శైలి.
జియాంగ్జీ నది మధ్యలో వాహనాలు వేగంగా వెళ్తుంటే ఆ దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను చూస్తూ వావ్ అనకుండా ఉండలేరు. నది మధ్యలో వాహనాలతో దూసుకెళ్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది.
అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ రోడ్డును వెడల్పు చేయాలంటే.. చాలా చోట్ల టన్నెళ్లు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలుగొట్టాలి. నివాసాలను ఖాళీ చేయించాలి.
ఈ తలనొప్పులతో పోలిస్తే నది మధ్యలో వంతెన నిర్మించడం సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు ఓకే చెప్పింది.
మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఈ 'రివర్ హైవే'ను సందర్శించే పర్యాటకుల తాకిడి కూడా అంతకంతకు పెరుగుతోంది.
0 Comments:
Post a Comment