Rains Alert for Telugu States: ఏపీ, తెలంగాణల్లోని ఆ ప్రాంతాల్లో మరో రెండ్రోజులు వర్షాల హెచ్చరిక
Rains Alert for Telugu States: వేసవి ప్రారంభమైంది. ఓ వైపు ఎండలు పెరుగుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ.
ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మిశ్రమంగా ఉంటోంది. ఓ వైపు ఎండలు పెరుగుతుంటే మరోవైపు అకాల వర్షాలు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికితోడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అటు అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
ఇక ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో రెండ్రోజులపాటు పడవచ్చని అంచనా. ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడన వర్షం పడే అవకాశాలున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది. అకాల వర్షాలకు ఇప్పటికే రైతాంగం చాలా నష్టపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షాల హెచ్చరిక జారీ కావడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.
విదర్బ నుంచి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి ఆవహించింది. మార్చ్ 28 తరువాతే రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండనుంది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు. తెలంగాణ హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళ తేలికపాటి వర్షాలు పడవచ్చు.
0 Comments:
Post a Comment