Prepay Home Loan : ముందుగానే హోం లోన్ క్లియర్ చేయాలని అనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటిస్తే వడ్డీ భారం ఉండదంతే..!
గృహ రుణం తీసుకున్నప్పుడు రుణం ప్రారంభ సంవత్సరాల్లో, ఈఎంఐలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండే విధంగా నిర్మాణాత్మకంగా ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ వడ్డీ భారం క్రమంగా తగ్గుతుంది.
కాబట్టి ఎంత త్వరగా రుణాన్ని ముందస్తుగా చెల్లిస్తే అంత మంచిది. ముందస్తుగా చెల్లించే డబ్బు నేరుగా హోమ్ లోన్ ప్రిన్సిపల్‌ను తగ్గించడానికి వెళ్తుంది. కాబట్టి మొత్తం వడ్డీ ధరపై పెద్ద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అనేక సురక్షిత రుణ సాధనాలు అందించే దాని కంటే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నందున, మీరు వాటిని నిర్వహించగలిగితే ముందస్తు చెల్లింపులను ప్రారంభించవచ్చు. పోస్ట్-టాక్స్ హోమ్ లోన్ రేట్లను తగ్గించే హోమ్ లోన్ ట్యాక్స్ బెనిఫిట్ యాంగిల్ కూడా ఉంది. కానీ ఇప్పటికీ చాలా మందికి రుణాలు ఒక భారంగా ఉంటాయి. అలాంటి వారు ముందస్తు చెల్లింపులను చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు.
హోం లోన్ ముందస్తుగా చెల్లించడం ఇలా
ముందుగా హోం లోన్ కట్టాలంటే మనం ఏ సొమ్ముతో దాన్ని చెల్లిస్తున్నామో? గమనించాలి. ఎందుకంటే హోం లోన్ తీర్చాలనుకునే సొమ్ము అత్యవసర నిధి నుంచి మినహాయించాలంటే మాత్రం అలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం అనేది చెప్పి రాదనే విషయాన్ని గమనించి వీలైనంతగా ఆ సొమ్మును వాడకూడదని పేర్కొంటున్నారు. మీ హోంలోన్ రేట్ల కంటే చాలా తక్కువ వడ్డీని ఆర్జించే రుణ సాధనాలు (పొదుపు ఖాతాలో మిగులు కేటాయించని నగదు, మిగులు ఎఫ్‌డీలు మొదలైనవి) కలిగి ఉంటే, అవి అత్యవసర బఫర్‌లో భాగం కాకపోతే వాటితో మీరు గృహ రుణం తీర్చవచ్చు. ఇలా చేస్తే మీ బకాయి ఉన్న ప్రిన్సిపల్‌ని తక్షణమే తగ్గిస్తుంది. అలాగే కొంత మేర వడ్డీ రేటు పెంపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ప్రస్తుత ఆదాయ-వ్యయ అంతరం కొంత వెసులుబాటును కల్పిస్తే మీరు ఈఎంఐలను పెంచడం ద్వారా కూడా వడ్డీ భారం నుంచి గట్టెక్కవచ్చు. ఇలా చేయడానికి బ్యాంకు అధికారులను కలిస్తే సరిపోతుంది. ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడానికి మీ వార్షిక బోనస్/ప్రోత్సాహకాలను ఉపయోగించడం ఉత్తమ మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 1 నుంచి 2 అదనపు ఈఎంఐలు చెల్లించడానికి ప్రయత్నించాలని వివరిస్తున్నారు.
0 Comments:
Post a Comment