⭕టైమ్ పాస్ చేయడానికి వస్తున్నారా..*
» విద్యాశాఖాధికారులపై స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి
ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం
» పనితీరు బాగోలేదని అసంతృప్తి
» షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం.
🌻పెద్దాపురం, మార్చి 3: మీరంతా టైప్పాస్ చేయడానికి వచ్చారా. నాణ్య మైన విద్య అందించడానికి మీకు ఏంటి ఇబ్బంది. మీకు బాధ్యత లేదా అని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖాధికారు లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని చంద్రమాంపల్లి ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అలాగే వారిని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకోవడంతోపాటు వారి పుస్తకాలను పరిశీలించారు. అలాగే. మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర విషయాలను ఆయన అడిగి తెలు సుకున్నారు అనంతరం డీఈవో, డీవైఈవో, ఎంఈవోలను పలు విషయాలపై ప్రశ్నించారు. దీంతో వాళ్లు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతోపాటు తడ బడ్డారు. దీంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తంచేసి ఒకింత అసహనానికి గురయయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆర్జేడీని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక మైన విద్యే ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకువస్తుంటే మీ నిర్లక్ష్యం కారణంగా అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదన్నారు. ప్రతిష్టాత్మంగాఅమలుచేస్తున్న విద్యావిధానాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు సక్రమంగా అందించాలన్నారు. పర్యవేక్షణ బాగోకపోవడంతో టీచర్ల బోధన బాగోలేద న్నారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడుతూ వేతనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. జీతాలు సక్రమంగా రావడం లేదని చెప్పడంతో ముందు వీరికి వేతనాలు చెల్లించాకే తరువాత వేతనాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ నాగమణి, డీఈవో అన్నపూర్ణ, డీవై ఈవో సుభద్ర, ఎంఈవో సత్యనారా యణ, పాఠశాల హెచ్ఎం గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment