భారతదేశంలోని హిందువులు ఎన్నో రకాల ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలతో పాటు వాస్తు విషయాన్ని, వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతూ ఉంటారు.
ఇక అందులో భాగంగానే హిందువులు నిత్యం దీపారాధన చేసి దేవుడిని కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు.
కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో దీపరాధన చేయడం వల్ల ఇంట్లో అంతా పాజిటివిటీ నుండి అందరూ సంతోషంగా ఉంటారు.
అయితే ఎవరు ఎన్ని విధాలుగా పూజ చేసినా చాలామందికి పూజ చేసేటప్పుడు దీపం పెట్టేటప్పుడు ఏ నూనె తో దీపం పెడితే మంచిది అన్న సందేహం కలుగుతూ ఉంటుంది.
మరి నిత్య దీపారాధనకు ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందువులు దేవుడి ముందు నెయ్యి, నూనె తో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దేవుడికి కుడి వైపున నీయి దీపం వెలిగించాలి అప్పుడు అది మీ ఎడమ చేతి వైపు ఉంటుంది.
ఇక నూనె దీపం విషయం వస్తే నువ్వుల నూనె దీపాన్ని దేవుడికి ఎడమ వైపు అంటే మీకు కుడి వైపున వెలిగించాలి.
దేవతలకు నెయ్యి దీపాలను వెలిగిస్తారు ఏదైనా కోరిక కనుక ఉంటే నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తారు. అలాగే మన అవసరాలకు తగిన విధంగా ఒకటి లేదా రెండు దీపాలను వెలిగించవచ్చు.
అలా చేయడం వల్ల ఇంటి వాస్తులో అగ్ని మూలకం బలపడుతుంది. ఇంట్లో కానీ లేదంటే గుడిలో కానీ దీపం పెట్టేటప్పుడు ఎక్కువ మొత్తంలో నెయ్యి లేదా నూనె వేయాలి.
అలాగే నిత్య దీపారాధన వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. నిత్యం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీ, విష్ణు అనుగ్రహంతో పాటు తులసీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
0 Comments:
Post a Comment