జర్మన్ మరియు కుర్దిష్ పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం ఇరాక్ లోని టైగ్రిస్ నదిపై 3,400 సంవత్సరాల కాలం నాటి నగరాన్ని కనుగొన్నారు.
ఇది మిట్టని సామ్రాజ్యంలో(Mittani Empire) అత్యంత ముఖ్యమైన నగరమైన జఖికు నగరం కావచ్చునని నిపుణులు చెప్పారు.
తీవ్రమైన కరువుతో టైగ్రిస్ నది నీరు దాని దిగువ స్థాయికి పోయింది. మోసుల్ డ్యామ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది. నది నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పుడు ఈ ప్రదేశం దానంతట అదే కనిపించడం ప్రారంభించింది.
ఈ ప్రదేశంలో, అన్వేషకులు ఐదు సిరామిక్ పాత్రలు, కొన్ని అక్షరాలతో వ్రాసిన కొన్ని మట్టి పలకలు, మట్టి ఎన్వలప్‌లు, అనేక రంగుల గోడలను కనుగొన్నారు. నగర చరిత్రను మ్యాప్ తయారు చేసి నిపుణులు తెలుసుకున్నారు.
ఈ పురాతన నగరంలో ఒక రాజభవనం మరియు అనేక పెద్ద భవనాలు ఉండేవని నిపుణులు భావిస్తున్నారు. మిట్టని సామ్రాజ్యంలో (క్రీ.పూ. 1550-1350) ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉండే ఈ నగరం జఖికు కావచ్చునని చరిత్రకారులు చెప్పారు.
ఈ అన్వేషణ మిటాని-కాలపు నగరం ముగింపు మరియు ఈ ప్రాంతంలో అస్సిరియన్ పాలన ప్రారంభం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
టైగ్రిస్ నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో పరిశోధకుల టీమ్ కు ఎక్కువ సమయం లభించలేదు. అయినప్పటికీ, పరిశోధకులు తక్కువ సమయంలో నగరాన్ని మ్యాప్ చేయగలిగారు.
ఒక ప్యాలెస్‌తో పాటు, గోడలు మరియు బురుజులతో కూడిన భారీ కోట, బహుళ అంతస్థుల భవనం మరియు పారిశ్రామిక సముదాయం కనుగొనబడ్డాయి.
దుహోక్ ప్రావిన్స్‌లోని టైగ్రిస్ నదికి సమీపంలో ఈ ఆవిష్కరణ జరిగింది. కాంస్య యుగం నగరం వేల సంవత్సరాల క్రితం మునిగిపోయింది. అనేక నగరాలు కరువు బారిన పడినప్పుడు, అది మళ్లీ కనిపించడం ప్రారంభించింది.
0 Comments:
Post a Comment