ఒకవైపు ప్రపంచ దేశాలు(countries of the world) తమ తమ సరిహద్దుల కోసం పోరాటాలు సాగిస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్, భారత్-చైనా ఇలా చాలా దేశాల మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది.
తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్(Pakistan, Afghanistan) మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది.
ఇదిలావుంటే ప్రపంచంలో ప్రతి 6 నెలలకు దేశ పాలనను మరో దేశానికి అప్పగించే ఒక ద్వీపం(Island) ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఇది కథ కాదు... అక్షరాలా నిజం. ఈ ప్రత్యేకమైన ద్వీపాన్ని ఒక దేశం 6 నెలలు, మరొక దేశం 6 నెలలు పాలిస్తుంది.
ఈ ద్వీపం పేరు పీజంట్ ద్వీపం. ఈ ద్వీపం ఫ్రాన్స్- స్పెయిన్(France- Spain) మధ్య ఉంది. 1659వ సంవత్సరంలో ఈ ద్వీపానికి సంబంధించి ఒక ఒప్పందం(Agreement) కుదిరింది దీనిప్రకారం ఫ్రాన్స్ 6 నెలలు, స్పెయిన్ 6 నెలలు ఈ ద్వీప దేశాన్ని పాలిస్తాయి.
ఇక్కడ మరో విశేషమేమంటే ఈ ద్వీపానికి సంబంధించి ఫ్రాన్స్- స్పెయిన్ మధ్య ఎప్పుడూ యుద్ధం(war) జరగలేదు. ఫ్రాన్స్, స్పెయిన్ ఈ ద్వీపాన్ని ప్రతి 6 నెలలకోసారి చాలా శాంతియుతం(Peaceful)గా పాలిస్తాయి.
1659 సంవత్సరంలో ఈ ద్వీపానికి సంబంధించి ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని పైన్స్ ఒప్పందం(Agreement of the Pines) అని పిలుస్తారు.
ఈ ద్వీపం 200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ద్వీపాన్ని ఎవరు పరిపాలించాలనే దానిపై సందిగ్ధం(dilemma) నెలకొంది.
అయితే ఫ్రాన్స్, స్పెయిన్ పరస్పర అంగీకారంతో ఈ ద్వీపానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 6 నెలల పాటు ఈ ద్వీపం ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుందని, మరో 6 నెలల పాటు దీనిని స్పెయిన్(Spain) పరిపాలిస్తుందని తీర్మానించారు.
0 Comments:
Post a Comment