ఉరుకుల పరుగుల జీవితంలో త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ కోసమే ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. బ్రెడ్కి కాస్త పీనట్ బటర్ వేసుకొని తిని ఆఫీసులకి, స్కూళ్లకు వెళ్లేవారు ఎంతోమంది.
అందుకే ఇప్పుడు పీనట్ బటర్కు అభిమానులు ఎక్కువైపోయారు. అయితే దీన్ని తినడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కొంతమంది తింటే ఆరోగ్యమని, మరి కొంతమంది దీని అధికంగా తింటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పీనట్ బటర్ మితంగా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. రోజుకి ఒక స్పూన్ పీనట్ బటర్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అంతే కాదు కొన్ని రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.
1. పీనట్ బటర్లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది. గుండె సంబంధిత అనారోగ్యాలు రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రోజుకో స్పూన్ పీనట్ బటర్ తింటే మంచిదే.
2. పీనట్ బటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, మెగ్నీషియం, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను కాపాడతాయి. దెబ్బతిన్న కణాలను సరిచేస్తాయి. క్యాన్సర్ తో సమర్థవంతంగా పోరాడే శక్తిని ఇస్తాయి.
3. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం వారానికి కనీసం ఐదు రోజులు పాటు ఒక స్పూను పీనట్ బటర్ తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని తేలింది. అయితే దీని తయారీలో చక్కెరను వాడితే మాత్రం ప్రమాదం. అలా చక్కెర వాడని పీనట్ బటర్ దొరికితే మధుమేహులు తినవచ్చు.
4. స్వచ్ఛమైన పీనట్ బటర్లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని కంపెనీల వారు అధిక చక్కెర్లను, ప్రిజర్వేటర్లను వేసి చేస్తారు. ఇలాంటి వాటిని తినడం వల్ల ఉపయోగం ఉండదు.
5. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. ఆకలి త్వరగా వేయదు. కాబట్టి దీన్ని తినడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంది.
6. కొంతమందికి పీనట్ బటర్ అలెర్జీ ఉంటుంది. అలాంటివారు దీనికి దూరంగా ఉండటం మంచిది. ముందుగా ఆ అలెర్జీ ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకు చిన్న మొత్తంలో తిని చూడాలి. మీకు ఎలాంటి దురద లేదా ఇబ్బంది అనిపించినా దాన్ని తినవద్దు.
0 Comments:
Post a Comment