OMG: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 6 మద్యం బాటిల్స్ ఇవే.. ఒక్క సిప్ లక్షల్లోనే..కాళీ బాటిల్ కూడా ఖరీదే
మద్యం తాగితే ఏదో తెలియని కిక్ వస్తుంది.
మైకం కళ్లను ఆవహించడంతో ..మత్తుగా ఉంటుంది. కాని మీకు ఇప్పుడు చెప్పే కొన్ని మద్యం బ్రాడ్స్ ధరలు చెబితే తాగకుండానే మత్తు ఎక్కుతుంది. ప్రపంచంలోనే ఆరు అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. (File Photo)
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ధరలు చూస్తే ఇంతటి ఖరీదైన ఆల్కహాల్ తాగడం ఎవరి వల్ల అవుతుందని కొందరు ఫీలవుతుంటారు. కాని వాటి కోసం ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారు. తాగకపోయినా కనీసం బాటిల్ కొనుక్కొని వాసన చూస్తూ బ్రతికేస్తుంటారు. (File Photo)
వరల్డ్ కాస్ట్లీ ఆల్కహాల్ బ్రాండ్స్ ఎక్కడ దొరుకుతాయి..? వీటిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారనే విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఈ ఖరీదైన మద్యం బాటిళ్లను మాములు లిక్కర్‌లా కాకుండా తక్కువగా తయారు చేస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచుతారు. (File Photo)
వరల్డ్‌లోనే వెరీ కాస్ట్లీ వైన్‌గా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది టేకిలా లీ .925. దీని ధర దాదాపు రూ. 25 కోట్ల రూపాయలు. ఈ మందులో మత్తు సంగతి ఏమో కాని సీసాలో 6400 వజ్రాలు పొదిగి ఉండటం విశేషం.(Photo:Twitter@GWR)
హెన్రీ IV డుడోగాన్ కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం ఒక్క బాటిల్ ఖరీదు అక్షరాల 56 లక్షల 93 వేల రూపాయలు. దీని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం మరియు ప్లాటినంతో తయారు చేయబడింది.(shutterstock)
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మద్యం కేటగిరీలో దివా వోడ్కా కూడా ఉంది. దివా వోడ్కా ఒక్క ఫుల్ బాటిల్ ధర 7 కోట్ల 30 లక్షల రూపాయలు. అంటే ఒక్క బాటిల్ కొనే డబ్బులు పెట్టుకుంటే రెండు లగ్జరీ ఇళ్లు కట్టుకోవచ్చు. లేదంటే కొనుక్కోవచ్చన్నమాట.(Image- Twitter @HSLTom)
డెల్మోర్ 62 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీగా చెప్పబడుతుంది. ఎందుకంటే అందులో ఒక్క బాటిల్ ఖరీదు రూ.1.5 కోట్లకు పైగానే ఉంటుంది. మరి ఇంత ఖరీదైన మందు తాగే వాళ్లు కూడా అంతే రిచ్‌గా ఉంటారు.(Image- Twitter @bryk_bar)
ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ గురించి చెప్పాల్సి వస్తే అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు అంటే నమ్ముతారా.
వరల్డ్‌లోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవుతారు.
0 Comments:
Post a Comment