Nobel for Modi:నోబెల్ పీస్ ప్రైజ్ రేసులో ప్రధాని మోదీ..!
నోబెల్ బహుమతి అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. వివిధ రంగాల్లో అశేష కృషిని సేవలను అందించినవారిని గుర్తించి ఈ అవార్డును అందజేస్తారు.
ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895లో రాసిన వీలునామ ప్రకారం 1901 నుంచి నోబెల్ పురస్కారాలను అందిస్తున్నారు. ఈ అవార్డులను భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు అలాగే ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి నోబెల్ బహుమతిని ప్రతి ఏటా బహుకరిస్తుంటారు. ఏటా డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాలు అందిస్తారు. అయితే ఇప్పుడు ఈ బహుమతులు గురించి ప్రస్తావన ఎందుకని అనుకుంటున్నారా..? దేశ ప్రధాని నరేంద్ర మోదీని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనే వాదన తెరపైకి వచ్చింది. మరి ఆ కథేంటో చూద్దామా.
ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ఆయన ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మోదీ అంటే తెలియని దేశం ఉండదు. అంతలా అన్ని దేశాలతో మోదీ సత్సంబంధాలు నెరిపారు. అదే సమయంలో కొన్ని సంక్షోభ సమయాల్లో కూడా మోదీ తన మార్క్ పాలనతో ప్రపంచ దేశాధినేతల దృష్టిని ఆకర్షించారు. మోదీ ప్రధానిగా ఉన్ననాటి నుంచి పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. తనదైన శైలితో అక్కడి నాయకులను ఆకట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా మోదీ ఛరిష్మా ఖండాంతరాలను దాటింది. ఇక కరోనా సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలతో చాలా వరకు ప్రాణ నష్టం నుంచి దేశం బయటపడింది. అంతేకాదు ఇతర దేశాలకు కూడా మన దేశం నుంచి తయారైన వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడం ద్వారా మోదీ అక్కడి ప్రజల మనసులను గెల్చుకున్నారు. అందుకే పలు దేశాలు మోదీని వారి దేశ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించాయి. ఇందులో రష్యా మరియు భూటాన్ దేశాలున్నాయి.
ఇక తాజాగా ప్రధాని మోదీకి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. సాక్షాత్తు నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఆస్లే టోయే. నోబెల్ శాంతి పురస్కారం రేసులు ప్రధాని మోదీ ముఖ్య పోటీదారుడిగా ఉన్నారంటూ ఆస్లే వ్యాఖ్యానించారు. యుద్ధాలను తన చాకచక్యంతో ఆపి ఆ ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం కృషి చేయగల ఏకైక నాయకుడు మోదీనే అని కొనియాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన టోయే ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ పరిపాలనకు, ఆయన తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలకు తాను ముగ్ధుడైనట్లు ఆస్లే చెప్పారు.అందుకే భారత్ నేడు ప్రపంచ దేశాలకంటే మేటిగా ఉందని కొనియాడారు.అంతేకాదు భారత్ ఎప్పుడూ శాంతికాముక దేశంగా నిలిచిందని అందుకే నేడు ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య జరగుతున్న యుద్ధాన్ని ఆపడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అణ్వాయుధాలతో నెలకొనే ముప్పును ఊహించి ముందుగానే రష్యాను జాగ్రత్తపరచడంలో మోదీ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని ఆస్లే అన్నారు.
మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాపై కఠిన ధోరణితో వ్యవహరించలేదని, ఎవరినీ భయపెట్టలేదని, స్నేహపూర్వకమైన వాతావరణంలో విన్నవించిన విధానాన్ని ఆస్లే కొనియాడారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ విధానం చాలా అవసరమన్నారు. భారత్ ఆర్థికశక్తిగా ఎదగడంలో మాత్రమే మోదీ కీలకంగా వ్యవహరించడం లేదని, అంతర్జాతీయ వేడుకల్లో కూడా పాల్గొని తనదైన ముద్రను వేస్తున్నారని ఆస్లే మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
0 Comments:
Post a Comment