New Features in Whatsapp : గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే అనుమతి తప్పనిసరి.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్..
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌తో సహా దాని అన్ని వెర్షన్‌లలో వినియోగదారుల ఇంటర్‌ఫేస్, గోప్యతను మెరుగుపరచడానికి వా ట్సాప్ కొత్త అప్‌డేట్స్‌ను అభివృద్ధి చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రాబోయే కొన్ని అప్‌డేట్‌లలో కీబోర్డ్ కోసం 21 కొత్త ఎమోజీలు, గ్రూప్ చాట్ అడ్మిన్‌ల కోసం కొత్త ఆమోదం ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలను పరీక్షిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్న దాని వినియోగదారులను కొత్త వ్యక్తులను ఆమోదించడానికి అనుమతినిచ్చేలా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మరింత నియంత్రణను ఇస్తుంది.
అందుబాటులోకి ఎమోజీలు
వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం 21 కొత్త ఎమోజీలను పరీక్షిస్తోందని టెక్ నిపుణులు చెబుతన్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ కోసం కొత్త ఎమోజీ ప్యాలెట్ అందుబాటులో ఉంది. భవిష్యత్ అప్‌డేట్స్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఎమోజీలు వాట్సాప్ తాజా యూనికోడ్ 15.0 అప్‌డేట్‌లో భాగంగా ఉంటుదని పేర్కొంటున్నారు. ఇంతకుముందు కొత్త ఎమోజీలు అభివృద్ధిలో ఉన్నందున అధికారికంగా అందుబాటులో లేవు. అయితే ఇప్పుడు వాట్సాప్ తన వినియోగదారుల కోసం అధికారికంగా ఎమోజీలను పరీక్షించి విడుదల చేస్తోంది. కీబోర్డ్‌లోని కొత్త ఎమోజీలతో సహా అన్ని తాజా అప్‌డేట్‌లను పొందడానికి వినియోగదారులు తమ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
గ్రూప్ అడ్మిన్ల కోసం ప్రత్యేక ఫీచర్
గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా గ్రూప్‌లో చేరగలిగే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలనుకునే లేదా నియంత్రించే అవకాశం తాజా అప్‌డేట్‌తో గ్రూప్ అడ్మిన్లకు లభించనుంది. సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ వినియోగదారులు గ్రూప్ చాట్‌లో కొత్త పార్టిసిపెంట్‌లు గ్రూప్‌లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతిని కోరుతున్నట్లు ప్రాంప్ట్ చేసే సందేశాన్ని చూస్తారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ విడుదల కానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లలో కొత్త గ్రూప్ సెట్టింగ్‌లను కనుగొంటారు, ఇక్కడ ‘కొత్త పార్టిసిపెంట్‌లను ఆమోదించండి’ అనే ఎంపిక అందుబాటులో ఉంటుంది.
0 Comments:
Post a Comment