రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ల లైఫ్ స్టైల్ ఎంత రిచ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు. దేశంలో అపర కుబేరుడిగా..
ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు అంబానీ. అలాంటి అంబానీ లైఫ్ స్టైల్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు.
మరి వారి లైఫ్ స్టైల్ అలా ఉంటే.. వారి కింద పని చేసే, వారి ఇంట్లో పని చేసే వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా?.
మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ ప్రయాణించే కారు డ్రైవర్‌కు నెల జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా థింక్ చేశారా? అవును, అంబానీ కుటుంబ సభ్యులను అత్యంత జాగ్రత్తగా గమ్య స్థానాలకు చేర్చే కారు డ్రైవర్ జీతం భారీగానే ఉంటుంది.
ముఖేష్ అంబానీకి డ్రైవర్‌గా మారడం అంటే అంత సులభం కాదు. కుటుంబం మొత్తానికి డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి ముందుగా కఠినమైన శిక్షణ పొందాల్సి ఉంటుంది.
అంబానీ కుటుంబానికి డ్రైవర్‌ను ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందిస్తుంది. అయితే, ఆ డ్రైవర్‌కు అన్ని పరిస్థితుల్లోనే ఎలా మెలగాలి? ఆపదలో ఎలా ప్రవర్తించాలి? ఏ సమయంలో ఎలా డ్రైవింగ్ చేయాలి? వంటి అంశాలపై ఫర్‌ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. అన్నింట్లో సునిశితులైన వారిని అంబానీ డ్రైవర్‌గా నియమిస్తారు.
అంబానీ డ్రైవర్ జీతం ఎంత?
ప్రపంచంలోనే కుబేరుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ కుటుంబానికి డ్రైవర్‌గా పనే వ్యక్తికి నెల జీతం రూ. 2 లక్షలు ఉంటుందని సమాచారం.
ఈ డ్రైవర్స్.. అంబానీకి ఉన్న ఉన్న అన్ని రకాల విలాసవంతమైన కార్లను నడిపే సామర్థ్యం కలవారు.
అందుకే వీరికి నెల జీతం అంత ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆయన ఇంట్లో వంట చేసే వారికి కూడా జీతాలు భారీగానే ఉంటాయని తెలుస్తోంది.
0 Comments:
Post a Comment