Mangalasutra : మంగళసూత్రం విషయంలో తప్పులు చేస్తే భర్తకు ఆయు:క్షీణమే?
Mangalsutra: హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉంది. ఒక జంట పెళ్లి చేసుకుని జీవిత కాలం కలిసుండే వివాహంతో ఏకమయ్యే సంప్రదాయానికి విదేశీయులు సైతం ఎంతో అభిమానిస్తారు.
కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుంది అంటారు. అంతటి మహత్తర శక్తి పెళ్లిలో ఉందంటే అతిశయోక్తి కాదు. వివాహానికి ప్రతీకగా నిలిచేది మంగళసూత్రం. ఆడవారి ఐదో తనాన్ని సూచించేది ఇదే. దీంతో మహిళకు పెళ్లయిందో లేదో తెలియాలంటే తాళి నిదర్శనంగా నిలుస్తుంది. కాళ్లకు మెట్టెలు కూడా స్త్రీకి వివాహితగా సూచిస్తుంది. ఈ నేపథ్యంలో వివాహం సమయంలో ఉంగరం తొడగడం, మంగళసూత్రం కట్టడం ఆనవాయితీ. దీంతో మహిళకు మంగళసూత్రం అలంకార ప్రాయమే.
మంగళసూత్రం పవిత్రకు నిబద్ధత. మంగళకరమైన బంధానికి నిదర్శనమే. భార్యాభర్తల బంధంలో మంగళసూత్రమే ప్రామాణికం. ప్రేమ, నమ్మకం, నిబద్ధత, నియమాలకు మంగళసూత్రం గుర్తుగా నిలుస్తుంది. జీవితకాలం మంగళసూత్రం ఆడవారి మెడలోనే ఉంటుంది. దాన్ని ఎప్పటికి కూడా తీయరాదు. మంగళసూత్రం విషయంలో స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళసూత్రం సరిగా లేకపోతే భర్తకు అనారోగ్యం దరి చేరడం ఖాయం. మంగళసూత్రం మహిళల హృదయం మీదే నిలిచి ఉండటం మంచిది.
మంగళసూత్రానికి హెయిర్ డైలు, పిన్నులు లాంటివి గుచ్చకూడదు. మంగళసూత్రం దివ్యమైన శక్తిని ఇస్తుంది. భార్యాభర్తల అనురాగంలో మంగళసూత్రం ముఖ్యమైనది. మెడలో నుంచి మంగళసూత్రం తీయొద్దు. మంగళసూత్రం నల్లపూసలతో ఉంటుంది. ఇది నరదిష్టి పడకుండా కాపాడుతుంది. పరిపూర్ణమైన ఆయుష్షును ఇవ్వడంలో మంగళసూత్రం మెడలో నుంచి తీయడం చేయడం మంచిది కాదు. ఈ నేపథ్యంలో మంగళసూత్రాన్ని దైవంగా భావిస్తారు ఆడవాళ్లు.
వేదమంత్రాలతో కట్టిన తాళికి ఎంతో విలువ ఉంటుంది. బతికున్నంత కాలం మహిళ ఎద మీద వేలాడేది మంగళసూత్రం. అగ్నిసాక్షిగా కట్టిన తాళితో భార్యాభర్తల బంధం నూరేళ్ల అనుబంధంగా మారుతుంది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో వివాహమనే తంతుతో ఒక్కటయ్యే దంపతులకు నిదర్శనంగా మంగళసూత్రం ఉంటుంది. జీవితకాలంలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలిచేందుకు దోహదపడేదే మంగళసూత్రం. మంగళసూత్రం విషయంలో ఎలాంటి పరిమితులు ఉంటాయో తెలుసుకుని మరీ మసలుకుంటారు. తాళిని నిరంతరం మెడలో ఉంచుకోవడానికే మొగ్గు చూపుతారు. భర్త చనిపోయినప్పుడు మాత్రమే తాళి తీస్తారు.
0 Comments:
Post a Comment