Magha Poornima: మాఘ పౌర్ణమి. ఆరోజు నదుల్లో గాని, సముద్రంలో గాని స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తెలుగు నెలల్లో మాఘమాసం కు ఒక ప్రత్యేకత ఉంది.
మాఘమాసం “నెలరోజులు” పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు చెప్పారు. మాఘ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
లక్ష్మీనారాయణ లకు ప్రతీకరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైనది. మహా మాఘి అంటే మాఘ పౌర్ణమి. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి. ఈ మాఘ మాసం నాడు మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వపదం.
వరుసగా స్నానాలు సాధ్యం కాకపోయినప్పటికీ. మీసం నాగ పూర్ణిమ రోజు అయిన నదీస్నానం గాని, సముద్ర స్నానం గాని చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుంది.
Magha Poorinima speciality
స్నానం ఏ సమయంలో చేయాలి:
సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో స్నానం చేయాలి. సూర్యకిరణాలు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. కావున సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలి.
అయితే నదులు మరియు సముద్రాలు అందుబాటులో లేనివారు బావుల దగ్గర గాని,చెరువుల దగ్గర గాని, గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి, నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం అది లేనప్పుడు ఎన్ని సార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం..
బావినీళ్లల్లో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు.. దానధర్మాలు చేసే గుణం ఉండాలి.
ముఖ్యంగా మాఘమాసంలో నువ్వులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వీటిని తిలలు అని అంటారు “తిలా పాపం తలా పిడికెడు”అనే సామెతను మీరు వినే ఉంటారు.
నువ్వులు అంటే సాక్షాత్తు శనీశ్వరుడికి ప్రతిరూపం, శ్రీ మహావిష్ణువు చెమట బిందువులే ఈ “తిలలు” సాక్షాత్తు విష్ణు స్వరూపాలు
మాఘ మాసం నెల రోజులు మాగస్నానాలతో పాటుఒక వంతు చక్కెరకు, తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచి పెట్టమని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా మాఘస్నానాలు చేయాలి…
0 Comments:
Post a Comment