కువైత్ సిటీ: ఇప్పటికే ప్రవాసుల (Expats) పట్ల కక్ష్యసాధింపు చర్యలకు దిగిన గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
పవిత్ర రంజాన్ మాసంలో (Holy month of Ramadan) షాపింగ్, ఉత్పత్తుల కొనుగోలు కోసం ప్రవాసుల ప్రవేశాన్ని పలు సహకార సంఘాలు నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనివల్ల కో-ఆప్‌రేటివ్‌లలో పెద్ద సంఖ్యలో ప్రవాస దుకాణదారులు తగ్గింపు ధరలకు విక్రయించే రంజాన్ ఉత్పత్తులను కొనుగోలు చేయ్యలేకపోతున్నారని సమాచారం.
అయితే, ఈ చర్య చట్టవిరుద్దమని వినియోగదారుల రక్షణ సంఘం వెల్లడించింది. "ప్రవాసులు ఏదైనా సహకార సంఘంలోకి ప్రవేశించకుండా నిరోధించడం (Preventing), పౌరులకు మాత్రమే ఉత్పత్తులను విక్రయించడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం" అని వినియోగదారుల రక్షణ సంఘం చీఫ్ మెషాల్ అల్-మనే అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులు లేదా వలసదారులు అయినా వినియోగదారులకు వస్తువులను విక్రయించడానికి సహకార సంస్థ తిరస్కణనకు అవకాశం లేదు. వినియోగదారుల రక్షణ చట్టం అటువంటి నిర్ణయాల నుండి రక్షిస్తుంది.
సహకార సంఘాలు వాణిజ్య మంత్రిత్వశాఖ నుంచి వాణిజ్య లైసెన్స్ కలిగి ఉన్న సంస్థలు, ఇతర సారూప్య సంస్థలకు వర్తించే మార్కెట్ చట్టం వాటికి కూడా వర్తిస్తుందని మెషాల్ అల్-మనే పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. నేషనల్ గార్డ్ సొసైటీకి చెందిన అధికార యంత్రాంగం కువైటీలు కాని వినియోగదారులకు అమ్మకాలను నిరోధించడం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్తలను ఖండించింది. అలాంటిదేమి లేదని కొట్టి పారేయడం గమనార్హం.
0 Comments:
Post a Comment