వంటగదిలో స్టౌ మీద నుంచి వేడి గిన్నెలు దించడానికి, వేడి పాత్రల్ని తాకేటప్పుడు క్లాత్స్ ఉపయోగించడం మనకు అలవాటే! అయితే ఒక్కోసారి వాటిని ఉపయోగించినా చేతులు కాలుతుంటాయి.
పైగా ఆ క్లాత్స్‌ని పదే పదే శుభ్రం చేయడమూ కుదరకపోవచ్చు. అందుకే ఆ పనిని సులభతరం చేస్తూ, చేతులు కాలకుండా వేడి గిన్నెల్ని పట్టుకోవడానికి వీలుగా ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి సరికొత్త 'మిటెన్ గ్లోవ్స్'.
సిలికాన్, కాటన్, పాలిస్టర్.. వంటి మెటీరియల్స్‌తో తయారైన ఈ గ్లోవ్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో, డిజైన్లలో లభ్యమవుతున్నాయి.
ఇవి వంద శాతం ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. వీటి సహాయంతో స్టౌ పైనుంచి వేడి గిన్నెల్ని దించడమే కాదు.. అవెన్‌లో బేకింగ్ ట్రేలు, పాత్రలు పెట్టేటప్పుడు, తీసేటప్పుడు వాడచ్చు.. అలాగే గ్రిల్ చేసేటప్పుడు చేతులు కాలకుండా కూడా వీటిని ధరించచ్చు.
వీటిలో కొన్ని రకాల గ్లోవ్స్‌కి అరచేతి వైపు బొడిపెల్లాంటి ఉపరితలం ఉంటుంది. పండ్లు, కాయగూరల్ని శుభ్రం చేసేటప్పుడు రుద్ది మరీ కడగడానికి ఇలాంటి గ్లోవ్స్‌ని ఉపయోగించచ్చు.
అంతేకాదు.. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు పదే పదే చేతులు నీటిలో తడవకుండా కూడా వీటిని వేసుకోవచ్చు. ఇక వీటిని ధరించి మరుగుతున్న నీటిలో నుంచి గుడ్లు, ఇతర కాయగూరల్నీ వేరు చేయచ్చు.
ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలున్న ఈ మిటెన్ గ్లోవ్స్‌ని శుభ్రం చేయడమూ సులభమే!
0 Comments:
Post a Comment