Kidney: కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Stones in Kidney: ఇటీవల కాలంలో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయి. తరచుగా వేధిస్తున్న సమస్యల్లో కిడ్నీల్లో రాళ్లు ఒకటి. దీంతో చాలా మంది మందులు వాడుతూ ఇబ్బందులు పడుతున్నారు.
రాళ్లు సైజ్ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయడమే మార్గం. తక్కువగా ఉంటే నీళ్లు, మందుల ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు వయసులతో సంబంధం లేకుండా వస్తోంది. దీంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలేంటని ఆరా తీస్తే మనకు ఆశ్చర్య కర విషయాలు తెలుస్తున్నాయి.
ఎండాకాలంలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వేసవిలో మనం తాగే నీరు ఎక్కువగా చెమట రూపంలో వెళ్తుంది. దీంతో శరీరంలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. మనం తాగే నీరు బయటకు వెళ్లడంతో కిడ్నీలు వ్యర్థాలను తొందరగా బయటకు పంపించలేవు. దీంతోనే రాళ్లు ఏర్పడటానికి అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మనం వేసవిలో కూడా ఎక్కువ నీరు తాగేందుకు మొగ్గు చూపాలి. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు కిడ్నీలు పంపిస్తుంటాయి.
ఎండాకాలంలో మూత్రం తక్కువగా పోస్తాం. దీనికి కారణం మనం తాగే నీరు చెమట రూపంలో బయటకు పోవడమే. దీంతో బయట తిరిగే వారికి యూరిన్ ఎక్కువగా రాదు. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు రక్తంలో కాల్షియం, ఇతర వ్యర్థాలు బయటకు వెళ్లవు. యూరిన్ ఎక్కువ మోతాదులో వెళితే వ్యర్థాలు బయటకు పోతాయి. కానీ తక్కువ మోతాదులో వెళితే వ్యర్థాలు లోపలే ఉండిపోతాయి. యూరియా, యూరిక్ యాసిడ్ లాంటివి బయటకు వెళ్లకపోతే మూత్రం మంటగా వస్తుంది.
దీనికి ఓ పరిష్కారం ఉంది. మనం అల్పాహారం, భోజనం చేసిన తరువాత రెండు గంటలకు లీటరున్నర నీళ్లు తాగాలి. దీంతో మన కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్తుంటాయి. దీంతో మనకు రాళ్లు ఏర్పడే అవకాశం ఉండదు. ఇంకా శీతల పానీయాలు తాగడం మానుకోవాలి. వీటిలో కూడా కిడ్నీలను డ్యామేజ్ చేసే వ్యర్థాలు ఎక్కువగా లోపలకు వెళ్లడంతో ఇబ్బందులు వస్తాయి. అందుకే యువతలోనే కిడ్నీల్లో రాళ్లు వస్తున్నాయి. దీంతో ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉండవు.
0 Comments:
Post a Comment