Jobs In KVS: KVSలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
కేంద్రీయ విద్యాలయ సంగతన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్రీయ విద్యాలయ ఎస్వీపీ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్(Hyderabad) కాంట్రాక్ట్ విధానంలో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, వొకేషనల్ కోచ్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీ చేయనుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పీజీటీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీజీటీలో అన్ని సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు.. పీఈర్టీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://npasvp.kvs.ac.in/school-announcement లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదని.. మార్చి 10, 2023న ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు కేంద్రీయ విద్యాలయనో SVP NPA, హైదరాబాద్ - 500052 అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.27,500 చెల్లిస్తారు. టీజీటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.26,250 చెల్లించనున్నారు. పీఆర్టీ పోస్టులకు రూ.21,250 చెల్లిస్తారు. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్లకు మించకుండా ఉండాలి.
మ్యూజిక్, డ్యాన్స్ తదితర పోస్టులు..
వీటితో పాటే.. వొకేషనల్ కోచెస్/కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ / మ్యూజిక్ / డ్యాన్స్ / స్పోర్ట్స్ / ఆర్ట్స్ /డాక్డర్ / నర్సు/ స్పెషల్ ఎడ్యూకేటర్ / ఎడ్యూకేషనల్ కౌన్సిలర్ వంటి పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తులు చేసుకునే అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, డిగ్రీ, డిప్లొమా కోర్సు చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,250 చెల్లిస్తారు.
0 Comments:
Post a Comment