Jagan Politics: జగన్ దెబ్బకు 'జేఏసీ' విలవిల! ఇక ఉద్యమం లేనట్టే!
సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) దెబ్బకు ఉద్యోగ సంఘాలు రాజీమార్గాన్ని ఎంచుకున్నాయి. ఉద్యమ ప్రణాళిక రూపకల్పన చేయాలని భావించిన సంఘాల నేతలు వాయిదా వేసుకున్నారు.
ఆ విషయాన్ని గురువారం ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఫైనల్ సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించి జగన్ (Jagan) చెప్పినట్టు నడుచుకో బోతున్నారని సమాచారం. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష వర్గాలుగా విడిపోయిన ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాల్లో మునిగిపోయారు. ఆ క్రమంలో వైసీపీ మంత్రులు చెప్పినట్టు వినడానికి సై అంటున్నారు.
ఉద్యోగుల ప్రధానమైన డిమాండ్ సీపీఎస్ రద్దు
సీపీఎస్ స్థానంలో బెటర్ పెన్షన్ స్కీం (బీపీఎస్) ను తీసుకొచ్చే ప్రతిపాదన పైన బుధవారం చర్చలు జరిగాయి. ఉద్యోగులకు ఎక్కడా నష్టం లేకుండా ప్రతిపాదనలకు గతంలో మాదిరిగా హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. దీని పై మరోసారి త్వరలోనే సమావేశం జరగనుంది. సాధ్యమైనంత త్వరగా సీపీఎస్ అంశానికి ముగింపు ఇవ్వాలని ప్రభుత్వం
భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, తాజాగా ప్రభుత్వం నుంచి ఉద్యోగుల బకాయిల చెల్లింపు, ఇతర అంశాల పైన హామీలు ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తమ ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.
వాస్తవంగా పెండింగ్ బకాయిల చెల్లింపుతో పాటుగా సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. ప్రభుత్వంలోని మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు చేసారు. బకాయిల చెల్లింపు పైన హామీ ఇచ్చింది. రూ 3 వేల కోట్లు ఈ నెలలోనే చెల్లించనున్నట్లు స్పష్టత ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించి డీఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు స్పష్టత లభించిందని సంఘాల నేతలు చెబుతున్నారు . సెప్టెంబర్ లోగా రెండు విడతలుగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చర్చలు సానుకూలంగా జరిగినందుకు ఉద్యమ కార్యాచరణ నిలిపివేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలను కోరింది.
చర్చల్లో తీసుకున్న నిర్ణయాల పై మినిట్స్ అందించాలని సంఘాల నేతలు కోరారు.
ప్రభుత్వంతో జరిగిన చర్చల మినిట్స్ ఉద్యోగ సంఘ నేతలకు రాత్రి పొద్దు పోయిన తరువాత అందాయి. జేఏసీ నేతలకు ప్రభుత్వం వీటిని పంపింది. వీటి పైన ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు చేస్తున్నారు. గురువారం ఉదయం మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణ పైన తమ నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావటంతో పాటుగా ఉద్యోగ సంఘాలు కోరిన విధంగా మినిట్స్ ఇవ్వటంతో ఉద్యమం వాయిదా వేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. బకాయిలు, డిఏ చెల్లింపులు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ , హెల్త్ కార్డుల అంశంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నెల 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో హెల్త్ కార్డు సమస్యలపైన సమావేశం ఏర్పాటు చేసారు. సెప్టెంబర్ లోగా రెండు విడతలుగా బకాయిలు క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. పెండిండ్ బకాయిల చెల్లింపు పైనా హామీ దక్కింది. ఈ నెలాఖరులోగా మూడు వేల కోట్ల మేర బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిది. మిగిలిన బకాయిలు రెండు విడతల్లో సెప్టెంబర్ లోనూ చెల్లిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఉద్యోగులు ప్రస్తావిస్తున్న ఇతర అంశాల పైన చర్చల సమయంలో హామీ ఇచ్చింది. ఇవే డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి చర్చల మినిట్స్ అందాయి. ఉద్యోగ సంఘాలు ఈ రోజు కీలక నిర్ణయం ప్రకటించడానికి రెడి అయ్యాయి. ఆ ప్రకటన సీఎం జగన్మోహన్ రెడ్డి కి సానుకూలంగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తం మీద ఉద్యోగులపై జగన్ మార్క్ విజయం కనిపిస్తుంది.
0 Comments:
Post a Comment