Investments: రూ. 333 పొదుపుతో రూ.16 లక్షలు పొందండి.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్!
పెట్టుబడి పెట్టడానికి ప్రదాన కారణం రెవిన్యూ జనరేట్ చేయడం. ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినా, దాని నుంచి పెట్టుబడిదారులు మెరుగైన రాబడిని ఆశిస్తారు.
ప్రస్తుతం పెట్టుబడి కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్స్, ఫండ్స్, డిపాజిట్లు, ఇతర మార్గాలను ఇన్వెస్టర్స్ ఎంచుకోవచ్చు.
అయితే పోస్టాఫీస్ స్కీమ్స్ అందరికీ చేరువవుతూ ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి పోస్టల్ డిపాజిట్లు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి. అందులోనూ పోస్టల్ రికరింగ్ డిపాజిటర్లు మంచి రాబడిని అందిస్తున్నాయి. బ్యాంక్ FDలు, RDలకు ఇవి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
పోస్టాఫీస్ RD అకౌంట్‌ను సులభంగా ఓపెన్ చేయవచ్చు. 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పోస్టల్ ఆర్డీ అకౌంట్ తీసుకోవచ్చు. వీటిలో కనిష్ట నెలవారీ డిపాజిట్ మొత్తం రూ. 100 చేస్తే చాలు. డిపాజిటర్లు ప్రతి నెలా తమ కాంట్రిబ్యూషన్‌ను రూ.10 మల్టిపుల్స్‌లో ఎంతైనా పెంచుకోవచ్చు. పోస్టాఫీస్ RDలపై డిపాజిటర్లు 5.8 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.
* ఎన్నో ప్రయోజనాలు : ఆర్డీ అకౌంట్ తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు లేదా 60 నెలల్లో.. ఏది ముందుగా వస్తే అది మెచ్యూరిటీగా పరిగణిస్తారు. అయితే పోస్టాఫీస్ RD టెన్యూర్ 5 సంవత్సరాలుగా ఉన్నా, దాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.
PPF, SCSS, పోస్టాఫీస్ FD వంటి అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల మాదిరిగానే ప్రతి త్రైమాసికంలో వీటిపై వడ్డీని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రస్తుతం పోస్టల్ RD వడ్డీ రేటు 5.8 శాతంగా ఉంది. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత డిపాజిటర్లు తమ డిపాజిట్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఒక సంవత్సరం తర్వాత డిపాజిటర్లు డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.
పోస్టల్ డిపాజిట్స్ అన్నింటికీ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. అంటే డిపాజిట్లు, వాటిపై అందే వడ్డీ రాబడికి హామీ ఉంటుంది. ఫలితంగా పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్న మొత్తంలో డబ్బును క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
* పదేళ్లలో భారీ రాబడి : పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్‌లో ప్రతి నెలా రూ. 10,000 లేదా రోజుకు రూ. 333 పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి ఆర్జించవచ్చు. పోస్టల్ ఆర్డీలపై చక్రవడ్డీ వర్తిస్తుంది. దీన్ని ప్రతి త్రైమాసికంలో లెక్కిస్తారు. తద్వారా ఇది పెట్టుబడిదారులకు మరింత ఆదాయాన్ని అందిస్తుంది.
ప్రస్తుత వడ్డీ రేటు 5.8 శాతం ప్రకారం, ఇన్వెస్టర్లు పదేళ్ల తర్వాత దాదాపు రూ.16 లక్షల రాబడిని పొందవచ్చు. పదేళ్లలో మొత్తం డిపాజిట్ రూ.12 లక్షలకు చేరుకుంటుంది. ఈ మొత్తంపై అందే రాబడి రూ. 4.26 లక్షలుగా ఉంటుంది. అంటే ఈ మొత్తం పెట్టుబడి ప్రయోజనం రూ. 16.26 లక్షలకు చేరుకుంటుంది.
0 Comments:
Post a Comment