ఈ తరం మహిళలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సంస్థ అనరాక్ సర్వే ఐదువేల మందితో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న మహిళల్లో సగానికిపైగా అంటే 65శాతం మంది సొంతగా ఇళ్లు కొనుగోలు చేసేందుకే పెట్టుబడులకే మొగ్గు చూపుతున్నట్లుగా తేలింది.(ఫైల్ ఫోటో)
ఈ సర్వేలో తేలిన మరికొన్ని విషయాలు ఏమిటంటే 36 శాతం మంది మహిళలు కేవలం 45-90 లక్షల బడ్జెట్‌తో కూడిన ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
27 శాతం మంది మహిళలు 90 లక్షల నుంచి కోటిన్నర విలువ చేసే ఆస్తిని కొనుగోలు చేయడం సరైనదని భావిస్తున్నారు.
20 శాతం మంది మహిళలు పెట్టుబడి కోసం రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన ఇళ్లను కొనడానికి ఇష్టపడుతున్నారు.(ఫైల్ ఫోటో)
గత పదేళ్ల కాలంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నివసించే మహిళల్లో సొంతగా గృహాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ ఈసందర్భంగా వెల్లడించారు.(Image : Canva)
ఈ నివేదికలో కేవలం 8 శాతం మంది మహిళలు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నట్లుగా తేలింది.
7 శాతం మంది మహిళలు తమ డబ్బును ఫిక్సిడ్ డిపాజిట్‌ల రూపంలో పొదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది.(ఫైల్ ఫోటో)
భారతదేశంలోని మహిళలు తమ సొంత పేరుతో ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని అనరాక్ సూచించింది.
అంతే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో మహిళలే ఇంటికి యజమానులుగా ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపింది.(ఫైల్ ఫోటో)
0 Comments:
Post a Comment