6 Secret Foods For Instant Stress Relief: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా చాలా మంది దీని కారణంగా బీపీ వంటి తీవ్ర దీర్ఘకాలీక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
లేకపోతే ప్రాణాంతకంగానూ మరే అవకాశాలున్నాయి. అయితే ఈ ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించడం చాలా మంచిది.
వాటి వినియోగించడం వల్ల సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడిని తగ్గించే ఆయుర్వేద నివారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గించే మూలికలు:
అశ్వగంధ:
అశ్వగంధ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల సులభంగా ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బ్రహ్మి:
బ్రహ్మీకి ఆయుర్వేదంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని టీ తయారు చేసి తాగడం వల్ల ఒత్తి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు.
జటామాంసి:
జటామాంసి మూలిక కూడా ఒత్తిడిని తగ్గించేందుతకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని పౌడర్‌గా చేసుకొని వేడి నీళ్లతో కలుపుకుని తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యోగా, ప్రాణాయామం:
ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ యోగా చేయడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీర దృఢంగా తయారవుతుంది.
మస్టర్డ్ ఆయిల్:
మస్టర్డ్ ఆయిల్ శరీరంలోని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని నాభిపై అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి:
తులసి టీని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వల్ల అన్ని రకాల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
0 Comments:
Post a Comment