దేశంలో భారీ ఎత్తున బంగారం నిల్వలు బయటపడ్డాయి. ఒడిశాలోని మూడు జిల్లాల్లో భారీ ఎత్తున బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారు.
అయితే, ఈ నిల్వలు వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న ఈ జిల్లాల్లో బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. గనులు సాకులు చూపి తమ భూములు లాక్కుంటారా అన్న భయాన్నీ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిక్షేపాలు ఎక్కడ కనుగొన్నారు..? స్థానికులు ఎందుకు బయపడుతున్నారన్నది ఇప్ప్పుడు తెలుసుకుందాం..
ఒడిశా రాష్ట్రంలోని జాజ్ పూర్ కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, దేవ్ గఢ్ జిల్లాల్లో బంగారు గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని మంత్రి ప్రఫుల్లా మల్లిక్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
ఈ నిల్వలు కియోంజఝర్, మయూర్‌భంజ్ జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో, డియోగఢ్ జిల్లాలో ఒక చోట గుర్తించారని అయన తెలిపారు. అయితే.. వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న ఈ జిల్లాల్లో బంగారం గనులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. ఈ నిల్వలు తమ భూములను ఎక్కడ దూరం చేస్తాయో అని వారు వాపోతున్నారు. గనులను సాకుగా చూపి ప్రభుత్వం, రాజకీయ నాయకులు కలిసి తమ భూమాకులను లాక్కుంటారేమో అని భయపడుతున్నారు.
కాగా, 15 రోజుల క్రితం దేశంలో భారీగా లిథియం నిల్వలు బయటపడ్డ సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో పరిధిలోని సలాల్ హైమనా ప్రాంతంలో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటన చేసింది. దీంతో పాటు 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించి వాటి సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేరవేసినట్లు తెలిపింది. వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా, మిగిలిన చోట్ల పొటాష్, మాలిబ్డినం, ఇతర బేస్ మూలకాలకు చెందిన నిక్షేపాలను గుర్తించినట్లు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఏపీ, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్లు అప్పట్లో గనులశాఖ ప్రకటన చేసింది. దేశంలో బంగారం నిల్వలు వెలుగులోకి రావడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0 Comments:
Post a Comment