India-China: గల్వాన్ లోయలో మూడేళ్ల క్రితం భారత సైనికులతో జరిగిన ఘర్షణలో వాడిన సంప్రదాయ ఆయుధాల వంటివాటిని చైనా తాజాగా భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
భారత సరిహద్దుల వద్ద చైనా మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
గల్వాన్ లాంటి ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు పదార్థాల వంటివి వాడకూడదని ఒప్పందం ఉన్న నేపథ్యంలో చేతిలో పట్టుకుని దాడి చేసే పదునైన ఆయుధాలపై చైనా మరోసారి దృష్టి పెట్టింది.
ఈ ఏడాది జనవరిలో చైనా ఆర్మీ ఇందుకుగానూ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఆ తదుపరి నెల ఆయుధాలను కొంది.
ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలన్న విషయంపై కూడా చైనా ఆర్మీ తమ సైనికులకు శిక్షణ ఇచ్చింది. మొత్తం 2,600 ఆయుధాలకు చైనా ఆర్మీ ఆర్డర్ ఇచ్చిందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఒక్కో ఆయుధం పొడవు 1.8 మీటర్లు ఉంటుందని సమాచారం. హామ్మర్ హెడ్, రాడ్ బాడీ, రాడ్ డ్రిల్.. ఈ మూడుపార్టులు అందులో ఉంటాయి.
కాగా, గల్వాన్ ఘర్షణలో అటు చైనా సైన్యం, ఇటు భారత సైన్యం నుంచి భారీగా ప్రాణనష్టం జరిగింది. అనంతరం ఇరు దేశాలు శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి.
0 Comments:
Post a Comment