భారతవైమానిక దళంలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు రక్షణశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. IAF నోటిఫికేషన్ ప్రకారం, అగ్నివాయు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియ 20 మే 2023 నుండి నిర్వహించబడుతుంది.
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ మార్చి 17 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ మార్చి 31, 2023. రక్షణ మంత్రిత్వ శాఖ అగ్నిపథ్ పథకం కింద, ఎంపికైన అభ్యర్థులకు వైమానిక దళంలో అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ కింద 4 సంవత్సరాల పాటు స్వల్పకాలిక అపాయింట్‌మెంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఎంపికైన అభ్యర్థులలో 25% మందికి 4 సంవత్సరాల తర్వాత శాశ్వత నియామకం ఉంటుంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.inద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్‌లతో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇంగ్లీషుతో సహా కనీసం 50% మార్కులు పొంది ఉండాలి. అయితే, కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఒకేషనల్ సబ్జెక్టులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, అభ్యర్థులు 26 డిసెంబర్ 2002 నుండి 26 జూన్ 2006 మధ్య జన్మించి ఉండాలి.
దీనికి అదనంగా, అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్దేశించిన భౌతిక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. మరింత సమాచారం, ఇతర వివరాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడండి.
వయస్సు:
వైమానిక దళం అగ్నివేర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
నియామకం కోసం సూచించిన భౌతిక అర్హత ప్రకారం, పురుష అభ్యర్థుల ఎత్తు కనీసం 152.5 సెం.మీ. , మహిళా అభ్యర్థుల పొడవు కనిష్టంగా 152 సెం.మీ. ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.
0 Comments:
Post a Comment