Highway and expressway: ప్రపంచంలోని ఏ దేశ ఆర్థిక వ్యవస్థ(Economic system)ను అంచనా వేయాలనుకున్నా ముందుగా ఆ దేశ రహదారులను గమనించాలి. ఏ దేశంలో రోడ్లు మెరుగ్గా ఉన్నాయో అక్కడి ఆర్థిక వ్యవస్థ కూడా బాగుందని గ్రహించవచ్చు.
దేశ ప్రగతి(Country progress)ని చాటిచెప్పే రెండు రకాల రోడ్లు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? ఒకటి హైవే, మరొకటి ఎక్స్‌ప్రెస్ వే. ఈ రెండూ రోడ్లే.. కానీ అవి ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెండింటికీ తేడా(difference) తెలుసుకునే ముందు దేశంలో ఈ రెండింటి సంఖ్య ఎంత ఉందో తెలుసుకుందాం.
దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల విషయానికొస్తే వాటి సంఖ్య మొత్తం 23, కాగా ప్రస్తుతం 18లో రహదారుల పనులు జరుగుతున్నాయి.
హైవే(Highway)ల గురించి చెప్పాలంటే వాటి సంఖ్య మొత్తం 599. ఈ రహదారుల మొత్తం పొడవు దాదాపు 1.32 లక్షల కిలోమీటర్లు. వీటిలో జాతీయ రహదారి NH44 దేశంలోని అత్యంత పొడవైన రహదారి.
దీని మొత్తం పొడవు 3745 కిలోమీటర్లు. ఈ రహదారి శ్రీనగర్(Srinagar) నుంచి కన్యాకుమారి వరకు వెళుతుంది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే(Expressway) హై లెవెల్‌లో నిర్మితమయ్యింది. ఇది 6 నుండి 8 లేన్‌లను కలిగి ఉంది. హైస్పీడ్ ట్రాఫిక్(traffic) కోసం ఎక్స్‌ప్రెస్‌వేలు తీర్చిదిద్దారు.
ద్విచక్ర వాహనాలతో సహా స్లో స్పీడ్ వాహనాలను వీటిపైకి అనుమతించరు. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌వే కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ర్యాంప్‌లు ఉంటాయి.
అంటే దీనిపై ప్రయాణించేవారు నియమిత ప్రదేశాల(Designated locations) నుంచి మాత్రమే బయటకు రావచ్చు.
ఏదైనా హైవే కొన్ని పెద్ద నగరాలు లేదా గ్రామాలను కలుపుతుంది. ఇది 2 లేదా 4 లేన్లతో కూడిన పెద్ద రహదారి. భారీ వాహనాలు(Heavy vehicles) దీని మీద నడుస్తాయి.
0 Comments:
Post a Comment