Healthy Breakfast Recipes: రోజూ అల్పాహారంలో వీటిని తింటే జీవితాంతం హెల్తీగా ఉంటారు
5 Healthy Breakfast Recipes : ప్రతి రోజూ ఉదయం పూట అల్పాహారాలు తీసుకోవడం వల్లే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఆయితే చాలా మంది ఉదయం టిఫిన్ తీసుకునే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు.
ఇలా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలతో పాటు, తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మసాలలు ఎక్కువగా ఉండే అల్పాహారం తర్వాత రోజంతా కడుపు బరువుగా ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
ఆరోగ్యకరమైన దేశీ అల్పాహారాలనే తినాల్సి ఉంటుంది:
పోహా:
ఆరోగ్యకరమైన శరీరం కోసం.. మీరు అల్పాహారంలో పోహాను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రుచికరమైనది, తేలికైనది.. కాబట్టి దీనిని ప్రతి రోజూ అల్పాహారంలో తీసుకుంటే, జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే రెట్టింపు రుచిని పొందడానికి అందులో వేరుశెనగలు, కూరగాయలు, కరివేపాకు, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ పోహాను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
ఉప్మా:
ప్రతి రోజూ అల్పాహారంలో కూడా ఉప్మా తినవచ్చు. దీనిని సెమోలినా నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో అధిక పరిమాణంలో కాల్షియం లభిస్తుంది. అయితే ఈ ఉప్మాలో ఉరద్ పప్పు కూడా కలుపుకుని తీసుకుంటే రెట్టింపు ప్రయెజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీనిని ప్రతి రోజూ తింటే బరువు కూడా పెరుగుతారు.
ఉత్తపం:
ఉరద్ పప్పు, బియ్యం గ్రైండ్ చేసి ఉత్తపం తయారు చేసుకుని ప్రతి రోజూ అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉత్తపం తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్-ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇడ్లీ:
ఇడ్లీని సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బియ్యం పిండితో తయారు చేసిన ఇడ్లీలు తినడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment