Health ఒక్క గ్లాస్ తాగితే చాలు.. అనేక రకాల క్యాన్సర్లు దూరం..
ముఖ్యంగా చెప్పాలంటే రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో రాగులు మొదటి స్థానంలో కచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
అయితే ఉదయం పూట రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా సంవత్సరాలుగా ఆహారంలో ప్రజలు వీటిని వినియోగిస్తూ వచ్చారు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తి ఎక్కువగా లభిస్తుంది. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
రోజు వారి ఆహారంలో రాగులను( Finger millet ) భాగం చేసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు దూరం చేసుకోవచ్చు.రాగులలో అమైనో యాసిడ్స్ త్వరగా ఆకలిని వేయకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇవి అధిక బరువును కూడా నియంత్రిస్తాయి. ఇందులో అధికంగా ఫైబర్( Fiber ) ఉండడం వల్ల ఎప్పుడూ కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.కొంత మంది స్త్రీలు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతారు. రాగులను ఆహారం గా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే క్యాల్షియం ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే రాగులు ప్రతిరోజు తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. శరీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రాగులను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల వారి శరీరం దృఢంగా తయారవుతుంది. రాగి పిండితో జావా చేసి పిల్లలకు ఇస్తే వారి ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల ఎముకలు బలంగా తయారవుతాయి. అంతే కాకుండా వారిలో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. రాగి జావాలో( Ragi java ) మజ్జిగ, తగినంత ఉప్పు వేసి కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా చేస్తే నీరసం ఆందోళన తగ్గడంతో పాటు వారి శరీరం దృఢంగా తయారవుతుంది. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
0 Comments:
Post a Comment