Health Tips | చాలామంది కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే భయపడుతుంటారు.
ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, అది తినడంవల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరుగుతుందని, దాంతో అవి మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని, ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఎక్కువ మంది కోడిగుడ్డు పచ్చసొనను పక్కన పెడుతుంటారు.
చాలామంది కోడిగుడ్డు పచ్చసొన (Egg Yolk)తినాలంటే భయపడుతుంటారు.
ఎందుకంటే దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, అది తినడంవల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరుగుతుందని, దాంతో అవి మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని, ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఎక్కువ మంది కోడిగుడ్డు పచ్చసొనను పక్కన పెడుతుంటారు.
కానీ అది ఒట్టి అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.గుడ్డు పచ్చసొనతో ప్రయోజనాలివి..
కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
గుడ్డు పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డి లకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు.
కోడిగుడ్డు పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. అదేవిధంగా గుడ్డులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
అంతేగాక, పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగలేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు.
0 Comments:
Post a Comment