శక్తి కోసం కొందరు, క్రీడల్లో రాణించేందుకు మరికొందరు..జిమ్‌లో వర్కవుట్స్ కోసం ఇంకొందరు ఎనర్జీ డ్రింక్స్‌ను (Health Tips) ఉపయోగిస్తుంటారు.
న్యూఢిల్లీ : శక్తి కోసం కొందరు, క్రీడల్లో రాణించేందుకు మరికొందరు..జిమ్‌లో వర్కవుట్స్ కోసం ఇంకొందరు ఎనర్జీ డ్రింక్స్‌ను (Health Tips) ఉపయోగిస్తుంటారు.
ఈ డ్రింక్స్ శరీరానికి చేసే మేలు కంటే వివిధ మార్గాల్లో హాని తలపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్ శరీరంలో క్యాన్సర్ ఇతర వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని నీరుగారుస్తుందని పరిశోధకులు గుర్తించారు.
పెద్దమొత్తంలో సుక్రోలోజ్ తీసుకుంటే ఎలుకలో తెల్లరక్తకణాల చురుకుతనాన్ని నిర్వీర్యం చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కృత్రిమ స్వీటెనర్ సుక్రోలోజ్ చక్కెర కంటే 600 రెట్లు తీపిదనం కలిగిఉంటుందని ఇది శరీరంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపుతుందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.
ఎలుకల్లో అధిక డోస్‌ల సుక్రోలోజ్ ఇవ్వగా అవి టీ సెల్స్‌ను యాక్టివేట్ చేయడంలో తక్కువగా ప్రేరేపితమయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఆహారంలో సుక్రోలోజ్ హానికరమని నిపుణులు పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment