ఉడుత రూపంలో హనుమంతుడు..ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇంకెక్కడా ఉండదు..
శ్రీరామ భక్తుడైన హనుమంతునికి మన దేశంలో చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంజనేయుడి దేవాలయాలు ఎన్నో మనకు కనిపిస్తాయి.
వివిధ రూపాల్లో హనుమాన్‌ను పూజిస్తారు. దేని ప్రత్యేకత దానిదే..! కానీ ప్రపంచంలో మరెక్కడా లేని హనుమంతుడి ఆలయం.. యూపీలోని అలీగఢ్‌లో ఉంది. ఇక్కడ హనుమాన్ జీని ఉడుత రూపంలో పూజిస్తారు. అచల్ సరోవర్ ఒడ్డున ఉన్న శ్రీ గిల్హరాజ్ మహారాజ్ ఆలయం (Gilharaj Mandir Aligarh) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉడుత రూపంలో బజరంగబలిని పూజిస్తారు. అలీగఢ్ (Aligarh)లో 50 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. కానీ గిల్హరాజ్ ఆలయానికి ఎంతో చరిత్ర.. విశిష్టతను కలిగి ఉంది.
ఈ ఆలయాన్ని నాథ్ వర్గానికి చెందిన సాధువు.. శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్.. నిర్మించారట. హనుమంతుడు ఆయనకు కలలో కనిపించి...నేను అచల్ తాల్‌లో నివసిస్తున్నాను.. అక్కడ నన్ను పూజించండి అని చెప్పారట. వెంటనే ఆ మహంత్ తన శిష్యుడిని అక్కడికి పంపించారు. అచల్ తాల్‌లో ఓ మట్టి కుప్పపై చాలా ఉడుతలు కనిపించాయి. వాటిని తరిమేసి.. ఆ స్థలాన్ని తవ్వగా.. ఉడత రూపంలో ఉన్న హునమంతుడి విగ్రహం బయటపడింది. విగ్రహం బయటపడిందని తెలసుకొని మహంత్.. అక్కడి వెళ్లారట. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారట. ఐతే ఆ విగ్రహం ఏ కాలం నాటిదో ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. కానీ మహాభారత కాలంలో శ్రీకృష్ణుని సోదరుడైన దౌజీ ఇక్కడ అచల్ తాల్‌లో పూజలు చేశారని చెబుతున్నారు.
శ్రీ గిల్హరాజ్ ఆలయంలో 41 రోజుల పాటు పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉడత రూపంలో ఉన్న హనుమంతుడిని దర్శించుకుంటే.. గ్రహాల దోషాలు తొలగిపోతాయట. ముఖ్యంగా శని చెడు దృష్టి నుంచి విముక్తి లభిస్తుందట. గిల్హరాజ్ జీ ఆలయాన్ని గిర్రాజ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ గుడిలో ఉడత రూపంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతి 25 నిమిషాలకు ఒకసారి అలంకరించి.. హారతి ఇస్తారు.
ఇక్కడి హనుమాన్ రూపం.. రామసేతు నిర్మాణంలో పాల్గొన్న ఉడుతను గుర్తు చేస్తుందట. వానర రూపంలో ఉన్న హనుమంతుడు ఒక్కడే వారధి నిర్మిస్తే.. ఇతర దేవతలకు ఈ సేవలో పాల్గొనే అవకాశం లభించిందని రాముడు భావించి..హనుమంతుడిని విశ్రాంతి తీసుకోవాలని చెబుతారట. కానీ రాముడి సేవ నుంచి తప్పుకోవడం ఏ మాత్రం ఇష్టంలేని హనుమంతుడు... ఉడత రూపంలో తిరిగొచ్చాడట. నీటిలో మునిగి.. ఇసుకలో దొర్లి..తన శరీరానికి అంటుకున్న ఇసుక రేణువులును.. వారధిపై విదిల్చారట. అలా ఉడుత చేసిన సాయానికి.. శ్రీరాముడు మెచ్చి.. ఉడుత వీపు మీద ప్రేమగా నిమిరాడట. అందుకే ఉడత వీపుపై ఇప్పటికీ మూడు చారలు కనిపిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
0 Comments:
Post a Comment